కోనసీమ జిల్లా: పట్టణంలో ఒక ప్రయివేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సూర్యనగర్‌కు చెందిన చిర్రా రంజిత(11)పట్టణంలోని ఒక ప్రయివేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. మంగళవారం యథావిధిగా స్కూల్‌కు వెళ్లిన రంజిత సాయంత్రం సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి ఇంటి వద్ద ఎవ్వరూ లేని సమయంలో ఇంటిలో చున్నీతో ఉరి వేసుకుంది.
గమనించిన కుటుంబీకులు హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రంజిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రామచంద్రపురం ఎస్సై ఎస్. నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి వేధింపుల కారణంగానే ఇలా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


