
కోనసీమ జిల్లా: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపింది. రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధి గుర్రం విన్సెంట్ ప్రసాద్ (16)పై సహచర విద్యార్థుల పైశాచికత్వం ప్రదర్శించారు బాధితుడి పొట్ట భాగం,చేతులపై విచక్షణ రహితంగా ఐరన్ బాక్స్‌తో వాతలు పెట్టారు.
శ్రీ చైతన్య స్కూల్‌లో చదువుతున్న కుమారుణ్ని చూసేందుకు ప్రసాద్ తల్లిదండ్రలు రావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. వాతలు పడిన గాయాలతో ఆపస్మాకర స్థితిలో ఉన్న విద్యార్థిని అత్యవసర చికిత్స నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి లక్ష్మీ కుమారి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
అయితే ఆమె ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, విద్యార్థిపై ఐరన్ బాక్స్‌తో దాడికి తెగబడ్డ సహచర విద్యార్థులు బాధితుడిపైకి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. తాము దాడికి పాల్పడిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.