సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, గుంటూరు కేఎల్ వర్శిటీ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ ఫస్టియర్ విద్యార్థి సురేష్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన విద్యార్థి బాపట్ల కొత్తపాలెం వాసిగా గుర్తించారు.
కాగా, తెలంగాణలోని బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. నిజాంపేటలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యహహారమే కారణమని తెలుస్తోంది.


