
చిత్తూరు జిల్లా: పుంగునూరులో ఓ ప్రైవేటు స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. భాష్యం స్కూల్‌లో ఆరో తరగతి విద్యార్థిని సాత్విక నాగశ్రీ(11) తలపై ఉపాధ్యాయుడు తలపై కొట్టాడు. దాంతో ఆ బాలిక పుర్రె చిట్లినట్లుగా ఎక్స్‌రేలో గుర్తించారు వైద్యులు. ఇది ఐదు రోజుల క్రితం జరగ్గా, ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది.
దీనిపై ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి. అయితే బాలిక తల్లి ఫిర్యాదును ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు. ప్రస్తుతం మదనపల్లె ప్రైవేటు ఆస్పత్రిలో బాలిక వైద్యం చేయించుకుంటోంది. దీనిపై పోలీసులకు నిన్న(సోమవారం) రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి విజేత. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
