‘నా భర్తను నా తండ్రే కాల్చి చంపాడు’ | Inter-Caste Marriage Ends in Tragedy at Darbhanga Medical College | Sakshi
Sakshi News home page

‘నా భర్తను నా తండ్రే కాల్చి చంపాడు’

Aug 6 2025 11:13 AM | Updated on Aug 6 2025 1:32 PM

Inter-Caste Marriage Ends in Tragedy at Darbhanga Medical College

పాట్నా: కులాంతర వివాహం డిగ్రీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని కోపోద్రికుడైన తండ్రి… అల్లుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.

పోలీసుల వివరాల మేరకు.. బీహార్‌లోని అతిపెద్ద నగరమైన దర్భంగలో ఘోరం జరిగింది. దర్భంగ మెడికల్‌ కాలేజీలో బీఎస్సీ (నర్సింగ్‌)రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్‌ కుమార్‌ను కాలేజీ ఆవరణంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.

ఇటీవల రాహుల్‌ కుమార్‌కు అదే కాలేజీలో నర్సింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న తన్ను ప్రియాతో కులాంతర వివాహం జరిగింది. అయితే, ఈ క్రమంలో కాలేజీ క్యాంపస్‌లో ఉండగా.. తన్ను ప్రియా చూస్తుండగానే ఆమె  తండ్రి ప్రేమశంకర్.. అల్లుడు రాహుల్‌ను ‌ కాల్చి చంపాడు.  అప్రమత్తమైన విద్యార్థులు, సిబ్బంది రాహుల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రేమ్‌శంకర్‌కు దేహశుద్ధి చేశారు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో తన్ను ప్రియా గుండెలవిసేలా రోదించారు. నా తండ్రే తుపాకీతో నా భర్తను కాల్చాడు. అతను నా ఒడిలోనే కుప్పకూలిపోయాడు’ అని కన్నీటీ పర్యంతరమయ్యారు. 

రాహుల్, తన్ను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఒకే హాస్టల్ భవనంలో వేర్వేరు అంతస్తులలో ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘మేం కాలేజీలో ఉండగా.. హూడీ ధరించిన ఓ వ్యక్తి రాహుల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అతని దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో రాహుల్‌ గుండెల మీద కాల్చాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఆ కాల్పులు జరిపింది నా తండ్రి ప్రేమ్‌శంకర్ ఝానే.  నా తండ్రి ప్రేమ్‌శంకర్ నా కళ్ళ ముందే నా భర్త గుండెలపై కాల్చాడు. నా భర్త నా ఒడిలో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది.

 కులాంతర వివాహ చేసుకున్న అనంతరం రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాం. నాకు నా భర్తకు.. నా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని చెప్పాం. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతరమయ్యారు

కాల్పుల తర్వాత, రాహుల్ స్నేహితులు, ఇతర హాస్టల్  సిబ్బంది నిందితుడు శంకర్‌పై దాడికి దిగారు. రాహుల్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న దర్భాంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. 

ఎస్పీ జగన్నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థిని కాల్చి చంపినట్లు మాకు మొదట సమాచారం అందింది. తరువాత, అతను,  అతని తోటి విద్యార్థి ప్రేమ వివాహం చేసుకున్నారని మాకు తెలిసింది. ఆమె తండ్రి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. ఝాకు చికిత్స చేయడానికి విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అనుమతించకపోవడంతో ఆసుపత్రిలో గొడవ జరిగింది. కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము’అని హామీ ఇచ్చారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement