breaking news
Darbhanga district
-
‘నా భర్తను నా తండ్రే కాల్చి చంపాడు’
పాట్నా: కులాంతర వివాహం డిగ్రీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని కోపోద్రికుడైన తండ్రి… అల్లుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల మేరకు.. బీహార్‌లోని అతిపెద్ద నగరమైన దర్భంగలో ఘోరం జరిగింది. దర్భంగ మెడికల్ కాలేజీలో బీఎస్సీ (నర్సింగ్)రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్‌ను కాలేజీ ఆవరణంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవల రాహుల్ కుమార్‌కు అదే కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన్ను ప్రియాతో కులాంతర వివాహం జరిగింది. అయితే, ఈ క్రమంలో కాలేజీ క్యాంపస్‌లో ఉండగా.. తన్ను ప్రియా చూస్తుండగానే ఆమె తండ్రి ప్రేమశంకర్.. అల్లుడు రాహుల్‌ను కాల్చి చంపాడు. అప్రమత్తమైన విద్యార్థులు, సిబ్బంది రాహుల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రేమ్శంకర్కు దేహశుద్ధి చేశారు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో తన్ను ప్రియా గుండెలవిసేలా రోదించారు. నా తండ్రే తుపాకీతో నా భర్తను కాల్చాడు. అతను నా ఒడిలోనే కుప్పకూలిపోయాడు’ అని కన్నీటీ పర్యంతరమయ్యారు. రాహుల్, తన్ను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఒకే హాస్టల్ భవనంలో వేర్వేరు అంతస్తులలో ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘మేం కాలేజీలో ఉండగా.. హూడీ ధరించిన ఓ వ్యక్తి రాహుల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అతని దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో రాహుల్ గుండెల మీద కాల్చాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఆ కాల్పులు జరిపింది నా తండ్రి ప్రేమ్‌శంకర్ ఝానే. నా తండ్రి ప్రేమ్‌శంకర్ నా కళ్ళ ముందే నా భర్త గుండెలపై కాల్చాడు. నా భర్త నా ఒడిలో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. కులాంతర వివాహ చేసుకున్న అనంతరం రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాం. నాకు నా భర్తకు.. నా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని చెప్పాం. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతరమయ్యారుకాల్పుల తర్వాత, రాహుల్ స్నేహితులు, ఇతర హాస్టల్ సిబ్బంది నిందితుడు శంకర్‌పై దాడికి దిగారు. రాహుల్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న దర్భాంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎస్పీ జగన్నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థిని కాల్చి చంపినట్లు మాకు మొదట సమాచారం అందింది. తరువాత, అతను, అతని తోటి విద్యార్థి ప్రేమ వివాహం చేసుకున్నారని మాకు తెలిసింది. ఆమె తండ్రి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. ఝాకు చికిత్స చేయడానికి విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అనుమతించకపోవడంతో ఆసుపత్రిలో గొడవ జరిగింది. కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము’అని హామీ ఇచ్చారు. दरभंगा जिला के बेंता थाना क्षेत्र अंतर्गत DMCH में घटित घटना के संदर्भ में अद्यतन घटना का संक्षिप्त विवरण :-दिनांक - 05.08.25 को समय करीब 04:40 PM बजे सूचना मिली कि बेंता थाना क्षेत्र अंतर्गत एक छात्र की गोली मारकर हत्या कर दी गई है। sho and sdpo visited spot and enquired— Darbhanga Police (@DarbhangaPolice) August 5, 2025 -
షాకింగ్; దేవత కోసం కళ్లు పీకేసుకున్న బాలిక
పట్నా: దుర్గామాత భక్తురాలైన ఓ బాలిక తన రెండు కళ్లను పెకిలిచి దేవతకు అర్పించింది. అందరినీ షాక్‌కు గురిచేసిన ఈ ఘటన బిహార్‌లోని దర్భాంగ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దర్భాంగ జిల్లా బహేరీ బ్లాక్ సిరువా గ్రామంలోని దుర్గామాత ఆలయంలో చైత్ర నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కోమల్ కుమారి అనే బాలిక ప్రతిరోజూ గుడికి వచ్చి పూజలు చేసేది. ఏడోరోజైన ఆదివారం అమ్మవారికి పూజలు జరుగున్న సమయంలో.. కుమారి తన రెండు కళ్లను బలవంతంగా పెకిలించుకుని దేవతకు అర్పించేయత్నం చేసింది. కళ్లవెంట ధారలా కారుతోన్న నెత్తురు చూసి అర్చకుడు సహా అందరూ స్థాణువైపోయారు. వెంటనే తేరుకుని సమీపంలోని ఆస్పత్రికి ఆమెను తరలించారు. అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడి నుంచి దర్భాంగ జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. దుర్గామాత చెప్పిందనే..: పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై, ఇంటివద్దే ఉంటోన్న కోమల్ కుమారి.. గత కొద్ది రోజులుగా విచిత్రంగా మాట్లాడినట్లు తెలిసింది. దుర్గామాత కలలోకి వచ్చేదని, ఏదో ఒక అవయవాన్ని అర్పించమనేదని కుమారి తన స్నేహితురాళ్లతో చెప్పుకునేది. ‘‘ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స అందిస్తున్నాం. బాలిక ఆరోగ్యంపై ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేం’’అని దర్భాంగ జిల్లా వైద్యాధికారి సంతోశ మిశ్రా అన్నారు. ఇది మూర్ఖత్వం.. మానసిక రుగ్మత: తాను పనిచేసే ఆలయంలో ఊహించని సంఘటనపై అర్చకుడు భవ్‌నాథ్ ఝా స్పందించారు. ‘నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఇవాళ కంటి ఆకారంలో ఉండే బెల్ పండ్ల గింజలను సమర్పిస్తాం. కానీ ఈ అమ్మాయి(కోమల్) నిజం కళ్లనే పెకిలించుకోవడం ముమ్మాటికీ మూర్ఖత్వమే. ఏ దేవతా భక్తులను కళ్లు, ఇతర అవయవాలు ఇవ్వమని కోరదు’ అని ఝా అన్నారు. ‘‘బాలిక తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతోంది. మూఢనమ్మకాలకు సంబంధించి ఇది తీవ్రమైన కేసు’’ అని పట్నాకు చెందిన మానసిక వైద్యుడొకరు తెలిపారు. -
బిహార్‌లో అమానుషం
దర్భాంగా: బిహార్ లోని దర్భాంగా జిల్లా పిప్రాలో ఓ దళిత మహిళ పట్ల అదే గ్రామానికి చెందిన కొందరు అమానుషంగా ప్రవర్తించిన సంఘటన సంచలనం రేపింది. మంత్రాలు, చేతబడులు చేస్తున్నదని, ఊళ్లో చిన్న పిల్లల అనారోగ్యానికి కారణమైందనే నెపంతో మహిళను చావబాదిన నలుగురు యువకులు.. ఆమె చేత మూత్రం తాగించారు. సమాచారం అందిన వెంటనే గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేసి, ఎఫ్ఐఆర్ నమోదుచేశామని దర్భాంగ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అంజని కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఊరు విడిచి వెళ్లిపోయిందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో దళితులపై దాడులు, వాటిని నిరసిస్తూ ఆందోళనలను జరుగుతున్న తరుణంలోనే బిహార్ లో ఈ అమానుష ఘటన వెలుగులోకిరావడం గమనార్హం.