బిహార్లో అమానుషం | Dalit woman forced to drink urine in Bihar | Sakshi
Sakshi News home page

బిహార్లో అమానుషం

Jul 30 2016 4:12 PM | Updated on Sep 4 2017 7:04 AM

బిహార్లో అమానుషం

బిహార్లో అమానుషం

మంత్రాలు, చేతబడులు చేస్తున్నదని, ఊళ్లో చిన్న పిల్లల అనారోగ్యానికి కారణమైందనే నెపంతో మహిళను చావబాదిన నలుగురు యువకులు.. ఆమె చేత మూత్రం తాగించారు.

దర్భాంగా: బిహార్ లోని దర్భాంగా జిల్లా పిప్రాలో ఓ దళిత మహిళ పట్ల అదే గ్రామానికి చెందిన కొందరు అమానుషంగా ప్రవర్తించిన సంఘటన సంచలనం రేపింది. మంత్రాలు, చేతబడులు చేస్తున్నదని, ఊళ్లో చిన్న పిల్లల అనారోగ్యానికి కారణమైందనే నెపంతో మహిళను చావబాదిన నలుగురు యువకులు.. ఆమె చేత మూత్రం తాగించారు.

సమాచారం అందిన వెంటనే గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేసి, ఎఫ్ఐఆర్  నమోదుచేశామని దర్భాంగ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అంజని కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఊరు విడిచి వెళ్లిపోయిందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో దళితులపై దాడులు, వాటిని నిరసిస్తూ ఆందోళనలను జరుగుతున్న తరుణంలోనే బిహార్ లో ఈ అమానుష ఘటన వెలుగులోకిరావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement