హాస్టల్‌ విద్యార్థిని బ్యాగ్‌లో ప్రెగ్నెన్సీ కిట్, మంగళసూత్రం | Guntur Welfare Hostel Under Fire After Pregnancy Kit Found In Student Bag, More Details Inside | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థిని బ్యాగ్‌లో ప్రెగ్నెన్సీ కిట్, మంగళసూత్రం

Nov 14 2025 9:00 AM | Updated on Nov 14 2025 10:00 AM

SC Welfare College Girls Hostel Incident

అధికారులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి

గుంటూరు జిల్లా: నగరం నడిబొడ్డున ఉన్న పరివర్తన భవన్‌ (ఎస్సీ వెల్ఫేర్‌ కాలేజీ బాలికల హాస్ట­ల్‌)లో ఓ విద్యార్థిని బ్యాగ్‌లో ప్రెగ్నెన్సీ కిట్, మంగళసూత్రం, మెట్టెలు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంక్షేమ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థినుల బ్యాగులు చెక్‌ చేసే క్రమంలో వారం రోజుల కిందట పరివర్తన భవన్‌లోని ఓ విద్యార్థిని బ్యాగులో ఇవి బయటపడ్డాయి. వెంటనే సిబ్బంది వార్డెన్‌కి చెప్పగా, వార్డెన్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. బయటకు పొక్క­డంతో బుధవారం రాత్రి సోషల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ లావణ్యవేణి హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్‌లో అపరిశుభ్ర వాతావరణం చూసి నివ్వెరపోయారు. 2గంటలకుపైగా ప్రతి గదిని తనిఖీ చేశారు. 

ముగ్గురు వా­ర్డె­న్లు ఉన్నప్పటికీ హాస్టల్‌ను ఈ విధంగా గాలికి వది­లేస్తారా అంటూ వారిపై ఆగ్ర­హం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మళ్లీ వస్తానని హెచ్చరించి, అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం. విద్యారి్థని బ్యాగ్‌లో దొరికిన ప్రెగ్నెన్సీ కిట్‌ వ్యవహారంపై ఏఎస్‌డబ్ల్యూఓ శైలజ­ను వివరణ కోరగా అటువంటి ఘటనలు గాని, ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన ఏఎస్‌డబ్ల్యూఓ(అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌), హాస్టల్‌ వార్డెన్‌కు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఆ శాఖ డీడీ(డిప్యూటీ డైరెక్టర్‌)ను ఆదేశించినట్లు తెలుస్తోంది.

 నెలకిందట ఇదే హాస్టల్‌కు చెందిన ఓ విద్యార్థినిని ఓ ఆకతాయి హైదరా­బా­ద్‌కు తీసు­కువెళ్లాడు. 3 రోజులపాటు పోలీసులు శ్రమించి ఆ విద్యార్థినిని హాస్టల్‌ అధికారులకు అప్ప­గించారు. ఈ విషయంలో విద్యార్థి­ని తల్లిదండ్రులు హాస్టల్‌ వద్దకు వచ్చి అధికారులపై మండిపడ్డారు. గతేడాది డిసెంబర్‌లో ఇదే పరివర్తన భవన్‌లో ఓ విద్యార్థిని ప్రసవించిన విషయం తెలిసిందే. ఈ విష­యం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అప్పటి వార్డెన్‌ను సస్పెండ్‌ చేశారు. హాస్టల్‌ నిర్వహణ­పై పాలకులు, అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉ­న్నా­రో చెప్పేందుకు ఈ వరుస ఘటనలే నిదర్శనం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement