లండన్ ప్రయాణానికి లోకేష్
ఇటు కేబినెట్ భేటీకి డుమ్మా..
ఈ నెల మొదటి వారంలో అమెరికా.. నేడు మళ్ళీ లండన్
ఎక్కే విమానం.. దిగే విమానం..
ప్రజల సొమ్ము మంచినీళ్లలా ఖర్చు చేయడంలో చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే పయనం.. వాటికి లక్షలు.. కోట్లలో అద్దెలు చెల్లిస్తూ షికార్లు చేస్తున్నారు. బయటకు చెప్పేది మాత్రం పెట్టుబడుల సాధన.. పారిశ్రామిక వేత్తలతో చర్చలు. రాష్ట్రానికి పరిశ్రమలు. వ్యాపారాలు తీసుకురావడం.. కానీ లోపల ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. కానీ ఈ ఏడాదిన్నరలోనే పదుల సంఖ్యలో ఢిల్లీ.. హైద్రాబాదు వంటి చోట్లకు షికార్లకు వెళ్లారు.
అంతేకాకుండా తండ్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్.. అమెరికా.. ఇలా ఎన్నిసార్లు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు.. అట్నుంచి వచ్చి రాష్ట్రానికి ఏం లాభం చేసారో చెప్పలేరు.. కానీ అయన ఎక్కినా విమానాలు మాత్రం రయ్యి రయ్యిన ఆకాశంలో ఎగురుతూనే ఉంటాయి. నవంబర్లో తండ్రితో కలిసి సింగపూర్ వెళ్లొచ్చారు.. ఆ తరువాత కొద్దీ రోజులకే డిసెంబర్ మొదటి వారంలో డల్లాస్ వెళ్లిన లోకేష్ అక్కడ తెలుగువారితో భేటీ అయ్యారు.
దీనికోసం ఐటీడీపీ .. ఎల్లోమీడియా ఇచ్చిన ఎలివేషన్లు అంతా ఇంతా కాదు.. లోకేష్ విదేశాలకు వెళ్లడం.. అక్కడి ఐటి ప్రముఖులతో ఫోటోలు దిగడం.. అంతే.. ఇక ఆ కంపెనీ ఆంధ్రా వచ్చేసినట్లు చెప్పడం.. ఆ మధ్య గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ను కలిసిన ఫోటోలు మీడియాకు విడుదల చేయడం లేటు.. వెంటనే ఇక గూగుల్ తో ఏపీకి చుట్టరికం కలిపేయడం. రాష్ట్రంలోని యువతకు ఐటీ జాబులు వచ్చినట్లు ప్రచారం చేయడం రొటీన్ అయింది.
తాజాగా నేడు ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న తరుణంలో లోకేష్ మళ్ళీ ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు వెళ్తున్నారు. అసలు ఈ పర్యటన గురించి ప్రభుత్వంలో ఎక్కడా ప్రకటన కానీ సమాచారం కానీ లేదు.ఈ నేపథ్యంలో ఆయన లండన్ ఎందుకు వెళ్తున్నారు.. అది వ్యక్తిగతమా ? ప్రభుత్వ పరంగా వెళ్తున్నారా అన్నది ఎక్కడ లీక్ చేయడం లేదు. డిసెంబర్ 29న కేబినెట్ భేటీ ఉన్నప్పటికీ అయన ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు ఎందుకు వెళ్ళారన్నది సందేహాస్పదంగా అనిపిస్తోంది. ఆయన రహస్యంగా ఎవరినైనా కలుస్తున్నారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.


