టాయ్ పప్పీ స్ఫూర్తితో మినీ లెదర్ బ్యాగ్ రూపకల్పన చేసింది ఎఫ్‌డీడీఐ విద్యార్థిని స్నిగ్ధప్రియ. తనలోని నైపుణ్యానికి పదునుపెట్టి తనదైన శైలిలో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మినీబ్యాగ్, స్లింగ్‌బ్యాగ్, స్పెక్ట్స్‌హోల్డర్‌ను తయారుచేసి తన క్రియేటివిటీని చాటింది.
వీటిని రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ–హైదరాబాద్ క్యాంపస్‌లో మంగళవారం ప్రదర్శించారు. కాగా స్నిగ్ధప్రియ ఎఫ్‌డీడీఐలో బీ.డీఈఎస్ లైఫ్‌స్టైల్ యాక్సెసరీస్ డిజైనర్ కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ తేజ్‌లోహిత్‌రెడ్డి, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో వీటిని ఆవిష్కరించినట్లు ఆమె తెలిపారు.
ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి..
భవిష్యత్తులో మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలన్నదే నా లక్ష్యం. ఆర్టిఫీషియల్ లెదర్‌తో ఈ మూడింటినీ తయారు చేశాను. టాయ్‌పప్పీ స్ఫూర్తితో వీటికి రూపకల్పన చేశాను. మినీ బ్యాగు తయారీకి ఆరు ఇంచుల లెదర్, ఒక బటన్ అవసరమైంది. దీనికి రూ.51 వ్యయం చేశాను. దీనికి స్పెక్ట్స్ హోల్డర్‌గా నామకరణం చేశాను. రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ క్యాంపస్ నూతన ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.
– స్నిగ్ధప్రియ, ఎఫ్‌డీడీఐ విద్యార్థి
(చదవండి: మచుపిచ్చుపై..భాగ్యనగర వాసుల సాహసయాత్ర.!)


