
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లో స్కుల్ బిల్డింగ్‌పై నుంచి పడి విద్యార్థి మృతి చెందాడు. మధుర నగర్‌లోని సెయింట్ మార్టిన్ స్కూల్‌లో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి రిజ్వాన్(15) స్కూల్ బిల్డింగ్ నాలుగో అంతస్థుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రిజ్వాన్ ప్రమాదవశాత్తూ పడిపోయాడా.. లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.