బెంగళూరు: భారత్ అనగానే ప్రపంచ దేశాలకు గుర్తుకు వచ్చే విషయం సంస్కృతి, భారతీయులు ఇచ్చే మర్యాద. అలాగే, భారత్ వచ్చే టూరిస్టులను కొందరు అతిథిలా గౌరవిస్తూ వారి మన్ననలు సైతం పొందారు. కానీ, కొందరు మాత్రం అతిథులుగా వస్తున్న ఎందరో యువతులను వేధిస్తున్నారు. దీంతో, వారి చేసే తప్పులకు భారత్ పరువు పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో వెలుగు చూసింది. ఓ కొరియన్ యువతికి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఎదురైన చేదు అనుభవాన్ని ఆవేదనతో చెప్పుకొచ్చారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొరియన్ యువతి కిమ్ సుంగ్ ఇటీవల బెంగళూరులోని తన స్నేహితురాలి వద్దకు వచ్చారు. అనంతరం, ఈనెల 19వ తేదీన ఆమె.. కొరియాకు వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అనంతరం, ఆమె కొరియన్ ఇమిగ్రేషన్ కూడా పూర్తి చేసుకుంది. అప్పుడే ఎయిర్‌పోర్టుకు చెందిన స్టాఫ్ అఫాన్ అహ్మద్ అనే వ్యక్తి వచ్చి ఆమె బ్యాగ్ చెక్ చేయాలని ఆర్డర్ వేశాడు. అయితే, కౌంటర్ చెక్ చేయడం వల్ల ఎక్కువ సమయం పడుతుందని.. ఈ కారణంగా ఆమె వెళ్లాల్సిన విమానం కూడా మిస్ అయ్యే అవకాశం అవుతుందని, పర్సనల్ చెక్ చేస్తానని ఆమెని నమ్మించాడు.
#IndiaTodayExclusive | A Korean tourist has accused a staff member at Bengaluru’s Kempegowda International Airport of sexually molesting her under the pretext of checking her ticket and baggage.
The woman, Kim Sung Kyung, consented to reveal her identity while speaking to India… pic.twitter.com/amDFYDeDKY— IndiaToday (@IndiaToday) January 22, 2026
అనంతరం, ఆమెను వాష్ రూమ్ వైపుగా తీసుకెళ్లాడు. ఇంతలో కిమ్‌పై అహ్మద్ చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. చెకింగ్ పేరిట.. ఆమె చెస్ట్, ప్రైవేట్ పార్టులను పదేపదే తాకుతూ లైంగికంగా వేధించాడు. పలుమార్లు అలా చెకింగ్ చేస్తూ రాక్షాసానందం పొందాడు. చివరగా ఆమెను వెనుక వైపుగా తిరగమని చెప్పి బలవంతంగా గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీంతో సదరు మహిళ అతడిని తోసేసే ప్రయత్నించగా ఓకే.. థాంక్యూ అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటన నుంచి వెంటనే తేరుకున్న కిమ్.. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేసింది. ఆమెకు జరిగిన షాకింగ్ ఘటనను అధికారులకు తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. అహ్మద్‌పై సెక్షన్ 75 BNS కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, సాధారణంగా ప్రయాణికులును ఎవరినైనా.. ఫిజికల్‌గా చెక్ చేసే అధికారం ఏ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్‌కు ఉండదు.


