సాక్షి,బళ్లారి: ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువజంట తుంగభద్ర నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. దావణగెరె జిల్లా హొన్నాళి పట్టణ సమీపంలో తుంగభద్ర నదిలోకి దూకి ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గుర్తించి అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించగా వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రక్షణా చర్యలు చేపట్టారు. సాహసోపేతంగా పడవ సాయంతో నదిలోకి వెళ్లి ప్రేమ జంటను సురక్షితంగా బయటకు తీశారు. బయటకు తీసిన వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువజంట ఇంట్లో ప్రేమను నిరాకరించడంతో పాటు పెళ్లి చేసుకునేందుకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. సకాలంలో సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై హొన్నాళి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి తల్లిదండ్రుల నిరాకరణతోనే
ఆత్మహత్యాయత్నం
సాహసోపేతంగా రక్షించిన
అగ్నిమాపక సిబ్బంది


