రాయచూరు రూరల్: ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక శ్రీశైల భక్తుల కాలినడకన పాదయాత్ర ప్రారంభమైంది. బుధవారం నుంచి కర్ణాటకలోని బాగల్‌కోటె, విజయపుర, జమఖండి, గదగ్, ధార్వాడ, హునగుంద, ఇలకల్ భక్త సమూహం వివిధ మార్గాల్లో ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు తమ మొక్కులు తీర్చాలంటూ పాదయాత్రలకు అంకురార్పణ గావించారు. ఏ రహదారిలో చూసినా భక్తులు మల్లయ్య విగ్రహాన్ని మోసుకొని కాలినడకన, కొంత మంది యువకులు కాళ్లకు కర్రలు కట్టుకుని నడక రూపంలో యాత్రలు చేపట్టారు. బాగల్‌కోటె నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర దూరం 650 కి.మీ. అవుతుంది. ప్రతి రోజు తెల్లవారు జామున 3 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాదయాత్ర చేస్తారు.


