శివాజీనగర: కర్ణాటక సీఎం సిద్దరామయ్య 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి ఎన్నికవడం చట్ట విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని సిద్ధరామయ్యకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సిద్దరామయ్య ప్రజాప్రతినిధుల చట్టం–1951ని ఉల్లంఘించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ శంకర్ అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కొట్టివేసింది.
దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు పథకం రాజ్యాంగ విరుద్ధం. ఇది పురుషుల పట్ల వివక్ష చూపిట్లే. కాబట్టి సిద్దరామయ్య ఎన్నిక చెల్లదు. ఆయనపై అనర్హత వేటు వేసి ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి’ అని పిటిషన్‌లో కోరారు.


