మూడు ముళ్లతో ఒక్కటైన జంట
బెంగళూరు: ప్రేమకు దేశం, భాష అనే హద్దులు లేవు. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన యువకుడు, చైనాకు చెందిన యువతి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చిక్కమాగళూరు హౌసింగ్ బోర్డుకు చెందిన రూపక్.. చైనాకు చెందిన జేడ్‌కు ఆ్రస్టేలియాలో చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు తెలిపారు. రెండు కుటుంబాలు అంగీకరించడంతో చిక్కమగళూరులోని ఒక్కలిగర కల్యాణ మండపంలో గురువారం ఘనంగా వివాహం జరిగింది. భారత్–చైనా సంప్రదాయాలు దాదాపు ఒకే మాదిరిగా ఉన్నాయని నవ వధువు సంతోషం వ్యక్తం చేసింది.



