ప్రకృతి కొన్ని ప్రదేశాలను అత్యంత శాంతంగా సృష్టిస్తుంది. అక్కడ కాలం కొంచెం నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. మైనస్ 40 డిగ్రీలలోనూ విస్తరించి, ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరంగా పేరొందింది. రష్యాలో ఉన్న యాకుట్స్క్ అనే పేరుగల నగరం ఓ ప్రత్యేక ప్రపంచంలా కనువిందు చేస్తుంది.
సైబీరియా ప్రాంతంలో లేనా నదీ తీరం దగ్గర ఉన్న యాకుట్స్క్ ది ప్రపంచ పటంలోనే ఒక ప్రత్యేక స్థానం. మంచు నేలపై భానుని కిరణాలు పడి, ఆకాశం నుంచి రాలిన వెలుగుల తారలా మార్చి ్ర΄ారంభంలో యాకుట్స్క్ కనువిందు చేస్తుంది. నట్టనడి వేసవిలో భూమి పచ్చని రంగులోకి మారి΄ోతుంది. ఈ రెండు కాలాల్లోనూ యాకుట్స్క్ ఒక ప్రత్యేక ప్రకృతి కథనాన్ని చూపిస్తుంది.
సైబీరియా ప్రభాత దృశ్యం
మార్చి, ఏప్రిల్ నెలలో ఉషోదయ సమయాన ఒక మనోహరమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. లేనా నది దగ్గర కనిపించే ప్రశాంతమైన పర్వతాలు, సుదూరంలో కనిపించే చెట్లు ఈ నగరానికి ఒక కొత్త రంగును అద్దుతాయి.
కోల్డెస్ట్ సిటీ.. విశేషాలు ఇవీ..
మైనస్ 40 డిగ్రీలు: యాకుట్స్క్ ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరాల్లో ఒకటి. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు –40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతాయి.
శాశ్వత భవనాలు: నగరం మొత్తం పెర్మాఫ్రోస్ట్ (శాశ్వతంగా ఉండేలా) పై నిర్మించబడింది. అందుకే భవనాలను దృఢమైన పిల్లర్లపై నిర్మిస్తారు.
డైమండ్స్‌కు ప్రసిద్ధి: యాకుట్స్క్ పరిసర ప్రాంతాలు డైమండ్స్‌కు ప్రసిద్ధి. ప్రపంచంలో ఎక్కువ డైమండ్స్ లభించే ప్రాంతాల్లో ఇది ఒకటి.
కార్లు ఆఫ్ చేయరు: వింటర్‌లో కార్ల ఇంజిన్ ఆఫ్ చేస్తే ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చాలాసార్లు ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచుతారు.
ఎక్స్‌ట్రీమ్ సీజన్స్
చలికాలంలో తీవ్ర చలిగా ఉండగా, సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు పెరుగుతాయి.
కష్టమైనా.. ఇష్టంగా!
యాకుట్స్క్ ప్రజలు ప్రకృతితో కలిసి జీవించేలా తమ లైఫ్‌స్టైల్‌ను రూపొందించుకున్నారు. గ్రామాల వీధుల్లో చిన్న మార్కెట్లు, సంప్రదాయ ఇళ్లు, ఉదయం సమయంలో కనిపించే కదలికలు ఇక్కడి నగర సంస్కృతిని తెలియజేస్తాయి. స్థానిక సంస్కృతిలో యాకుట్స్క్ సంప్రదాయ పరంపర, నృత్యం, కళలు ఈ ప్రాంత చరిత్రను ప్రతిబింబిస్తాయి.
సందర్శనీయ స్థలాలెన్నో!
యాకుట్స్క్ ప్రయాణంలో మామ్మోత్ మ్యూజియం అనేది యాకుట్స్క్‌కు చెందిన ఒక ప్రత్యేక చరిత్ర కథను చూపిస్తుంది. సైబీరియా భూమిలో కనిపించే, అంతరించిన ్ర΄ాచీన జీవుల అవశేషాలు ఇక్కడ ప్రదర్శనలో ఉంటాయి.
లేనా నదీ ఎంబార్క్‌మెంట్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తూ చాలా మంది ఈ నగర రిథమ్‌ను అర్థం చేసుకుంటారు.
కొంచెం దూరంలో ఉన్న లేనా పిల్లర్స్ నేచర్ ΄ార్క్ అనేది ప్రకృతి సృష్టించిన విశాల శిలా స్తంభాలతో అద్భుతంగా కనిపిస్తుంది.
అలాగే కింగ్డమ్ ఆఫ్ పెర్మాఫ్రోస్ట్ అనేది యాకుట్స్క్‌లో మంచు గుహల మధ్య కళాకృతులు కనిపిస్తాయి.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి ముందుగా ఢిల్లీ లేదా దుబాయ్‌కు చేరుకుని అక్కడి నుంచి మాస్కో వరకు విమానంలో వెళ్లాలి. మాస్కో నుంచి విమానంలో యాకుట్స్క్ చేరుకోవచ్చు.
ఎక్కడ ఉండాలి?
యాకుట్స్క్‌లో చిన్న హోటల్స్‌తో పాటు ట్రెడిషనల్ గెస్ట్ హౌసులు కూడా ఉంటాయి. లేనా నది దగ్గర ఉండే ప్రదేశాల్లో బస చేస్తే ఉదయం దృశ్యాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
ఏమి తినాలి?
ఇక్కడి లోకల్ ఫుడ్‌లో సైబీరియన్ రుచులు కనిపిస్తాయి. చేపలతో చేసే వంటలు, సూప్స్, సంప్రదాయ బ్రెడ్స్ స్థానిక భోజన సంస్కృతిని తెలియజేస్తాయి. లేనా నది తీరంలో మార్నింగ్ వాక్ చేయడం, మమ్మోత్ మ్యూజియం సందర్శించడం, లేనా పిల్లర్స్ దగ్గర ప్రకృతి శిల్పాలను చూడడం వంటి అనుభవాలు ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి.
యాకుట్స్క్ ట్రిప్ అనేది ఒక సుదూరమైన ప్రదేశానికి వెళ్లడం మాత్రమే కాదు. ఇది ప్రకృతి, మనిషి జీవితానికి మధ్య జరిగే ఒక అందమైన అనుభవం. మార్చి హిమ వెలుగుల నుంచి వేసవి పచ్చని రంగుల వరకు ఈ నగరం కొంగొత్త దృశ్యాలను కనువిందు చేస్తుంది.
– ఎం.జి.కిశోర్, పర్యాటకుడు


