టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ నిన్న (ఫిబ్రవరి 22) తమ తొలి సూపర్-8 మ్యాచ్ ఆడింది. అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఊహించని పరాభవం ఎదుర్కొంది. తద్వారా సెమీస్ అవకాశాలను కఠినం చేసుకుంది.
సెమీస్‌కు చేరాలంటే టీమిండియా ఇకపై ఆడే రెండు మ్యాచ్‌లు (వెస్టిండీస్, జింబాబ్వే) గెలవాల్సిందే. ఏ ఒక్క మ్యాచ్‌లో తడబడినా ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్‌రేట్‌పై ఆధార పడాల్సిన పరిస్థితి వస్తుంది. టీమిండియా ఈ స్థితికి రాకుండా ఉండాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లను చిన్న జట్లని తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
విండీస్, జింబాబ్వే పేరుకే చిన్న జట్లైనా, ఈ ప్రపంచకప్‌లో వారు ఏం చేశారో చూశాం. టీమిండియా లాగే ఆ జట్లు కూడా గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచి టాపర్లుగా సూపర్-8లోకి అడుగుపెట్టాయి. పైగా ఆ జట్లు గ్రూప్ దశలో తమకంటే చాలా మెరుగైన జట్లపై విజయాలు సాధించాయి.
జింబాబ్వే అయితే ఏకంగా ఆస్ట్రేలియా లాంటి అత్యుత్తమ జట్టుకే షాకిచ్చింది. శ్రీలంకను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. విండీస్ విషయానికొస్తే.. ఈ జట్టులో ఇటీవలికాలంలో ఎప్పుడూ కనపడని జోష్ కనిపిస్తుంది. పటిష్టమైన ఇంగ్లండ్‌కు షాకివ్వడంతో పాటు చిన్న జట్లపై పెద్దగా కష్టపడకుండానే విజయాలు సాధించింది.
భారత్ ఫిబ్రవరి 26న జింబాబ్వేతో.. మార్చి 1న వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. జింబాబ్వే మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో.. విండీస్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సి ఉన్నాయి. ఆయా వేదికలు భారత్‌కు అనుకూలమే అయినప్పటికీ.. ఏమరపాటుగా ఉంటే మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవమే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చిన్న జట్లని తేలికగా తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.


