ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ | Suryakumar Yadav to lead Mumbai ahead of SA T20Is | Sakshi
Sakshi News home page

ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌

Nov 21 2025 11:19 AM | Updated on Nov 21 2025 11:39 AM

Suryakumar Yadav to lead Mumbai ahead of SA T20Is

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఆడ‌నున్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026 స‌న్నాహ‌కాల దృష్ట్యా ఈ టోర్నీలో ఆడాలని సూర్యకుమార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ టీ20 టోర్నమెంట్‌లో ముంబై జట్టును సూర్య‌ ముందుండి నడిపించనున్నాడు. 

వాస్తవానికి ముంబై కెప్టెన్‌గా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యం వ‌హించాల్సి ఉండేది. కానీ అయ్య‌ర్ గాయం కార‌ణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. అత‌డి స్దానంలోనే సూర్య ముంబై ప‌గ్గాల‌ను చేప‌ట్ట‌నున్నాడు. అయితే  ఈ ఏడాది స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లకు సూర్య అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు.

ఎందుకంటే డిసెంబ‌ర్ 9 నుంచి సూర్య సార‌థ్యంలోని భార‌త్ జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల‌ టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ టీ20 సిరీస్‌ డిసెంబర్‌ 19తో ముగియనుంది. అదే స‌మ‌యంలో స‌య్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబ‌ర్ 26 నుంచి డిసెంబ‌ర్ 18 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

మరోవైపు స్టార్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే మాత్రం ఈ ఏడాది స‌య్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందుబాటులో ఉండనని ముంబై క్రికెట్‌ అసోయేషిన్‌కు తెలియజేసినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో మాత్రం ముంబై జట్టు సారథిగా శార్ధూల్‌ ఠాకూర్‌ వ్యహరిస్తున్నాడు.
చదవండి: IND vs SA: 'నీ ఈగోను ప‌క్క‌న పెట్టు'.. టీమిండియా ఓపెన‌ర్‌కు వార్నింగ్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement