సిడ్నీ: రిటైర్మెంట్ నుంచి బయటికొచ్చిన గ్రాండ్‌స్లామ్ మాజీ చాంపియన్ లీటన్ హెవిట్ తన తనయుడితో కలిసి ఆడుతున్న డబుల్స్ ఆటకు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. ఈ 44 ఏళ్ల ఆ్రస్టేలియన్ వెటరన్ స్టార్ న్యూసౌత్‌వేల్స్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో 16 ఏళ్ల టీనేజ్ కుమారుడు క్రూజ్‌తో కలిసి శుభారంభం చేశాడు.
కానీ క్వార్టర్ ఫైనల్లో మాత్రం తండ్రీతనయుల జోడీకి చుక్కెదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో హెవిట్–క్రూజ్ ద్వయం 5–7, 4–6తో డేన్ స్వీని– కలమ్ పుటెర్‌గిల్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది.
అంతకుముందు తండ్రీతనయుల జోడీ 6–1, 6–0తో ఆసీస్‌కే చెందిన హేడెన్ జోన్స్–పావ్‌లె మారినకొవ్ ద్వయంపై అలవోక విజయం సాధించింది. ఆ్రస్టేలియా డేవిస్ కప్ కెపె్టన్‌గా వ్యవహరించిన మాజీ ప్రపంచ నంబర్‌వన్ హెవిట్ 2001లో యూఎస్ ఓపెన్, 2002లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లను సాధించాడు.
2016లోనే ఆటకు వీడ్కోలు పలికాడు. దాదాపు దశాబ్దకాలం తర్వాత మళ్లీ టెన్నిస్ ఆటపై మనసుపెట్టి ఆడేందుకు సిద్ధమయ్యాడు. 2005లో ఆస్ట్రేలియా ప్రముఖ నటి బెక్ కార్ట్‌రైట్‌ను వివాహమాడిన వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు.


