
ఆస్ట్రేలియా దిగ్గజం మాజీ కెప్టెన్, మైఖేల్ క్లార్క్ మరోసారి క్యాన్సర్ బారిన పడ్డాడు. తను చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు క్లార్క్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చెకప్ చేయించుకోవాలని కోరాడు.
"నేను చర్మ క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. ఈ రోజు నా ముక్కుపై ఏర్పడిన క్యాన్సర్ కణితిని సర్జరీ ద్వారా తొలిగించారు. ఆస్ట్రేలియాలో స్కిన్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మీరందరూ క్రమం తప్పకుండా చర్మ పరీక్షలు చేయించుకోవాలి. నివారణ అనేది చికిత్స కంటే ఉత్తమమైనది. నా విషయంలో రెగ్యూలర్ చెకప్‌లు, ముందుగా గుర్తిచడం వల్లే నేను కోలుకో గలుగుతున్నాను.
దీన్ని ముందుగానే గుర్తించిన నా డాక్టర్ బిష్ సోలిమన్‌కు కృతజ్ఞతలు" అని క్లార్క్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో క్లార్క్ రాసుకొచ్చాడు. గతంలో కూడా క్లార్క్ ముక్కుపై ఓ క్యాన్సర్ గడ్డను వైధ్యులు తొలిగించారు. కాగా ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత(UV) ప్రభావం ఎక్కువగా ఉండటం, చర్మ కణాల అనియంత్రిత పెరగడమే ఇందుకు ప్రధానక కారణం.
కాగా 44 ఏళ్ల మైఖల్ క్లార్క్ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. 2004లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన క్లార్క్.. తన కెరీర్‌లో 15 టెస్టులు, 245 వన్డేలు 34 టీ20లు ఆడాడు. టెస్టు, వన్డేల్లో కంగారూ జట్టుకు సారథ్యం కూడా వహించాడు. అతడి కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా 2013-14 యాషెస్ సిరీస్‌తో పాటు వన్డే ప్రపంచకప్-2015ను కూడా ఆసీస్ సొంతం చేసుకుంది.
చదవండి: Asia Cup 2025: ఆసియాకప్‌లో టీమిండియా ఓపెనర్లు ఎవరు?