
ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్ వేదికగా ఆదివారం(అక్టోబర్ 19) జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు భావిస్తున్నాయి. అందు కోసం తమ తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు దాదాపు ఏడు నెలల తర్వాత ఆడనుండడంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టాప్ రన్‌స్కోరర్ ఎవరు? లీడింగ్ వికెట్ టేకర్ ఎవరు? విజేత ఎవరు? అన్న ఆంశాలపై తమ అంచనాలను మాజీలు వెల్లడిస్తున్నారు.
ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ చేరాడు. క్లార్క్ ఇటీవలే Beyond23 క్రికెట్ పోడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ తరపున ఎవరు టాప్ స్కోరర్‌గా నిలుస్తారన్న ప్రశ్న క్లార్క్‌కు ఎదురైంది. అందుకు బదులుగా విరాట్ కోహ్లి(Virat Kohli) పేరును క్లార్క్ చెప్పుకొచ్చాడు.
"నా అభిప్రాయం ప్రకారం.. ఈ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లిలో ఎవరు ఒకరో నిలుస్తారు. వారికి ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన అని అనుకుంటున్నారు. కాబట్టి వారు ఈ టూర్‌ను విజయవంతంగా ముగించే అవకాశముంది.
అయితే ఆస్ట్రేలియా పిచ్‌లో ఓపెనర్‌గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొవడం అంత సులువు కాదు. అదే మూడు, నాలుగో స్దానంలో బ్యాటింగ్ చేయడం సులభం. ఎందుకంటే బంతి పాతబడి ఉంటుంది, అంతేకాకుండా పిచ్ కూడా బ్యాటర్లకు సహకరించనుంది. కాబట్టి రోహిత్ కంటే కోహ్లికే లీడింగ్ రన్‌స్కోరర్‌కే నిలిచే అవకాశాలు ఉన్నాయి" అని క్లార్క్ పేర్కొన్నాడు.
కాగా టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేరును క్లార్క్ చెప్పకపోవడం గమనార్హం. గిల్ కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై అదరగొట్టాడు. 700 పైగా పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఆస్ట్రేలియాపై వన్డేల్లో గిల్‌కు అంత మంచి రికార్డు లేదు. గిల్ ఇప్పటివరకు 8 వన్డే ఇన్నింగ్స్‌లలో 35.00 సగటుతో కేవలం 280 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్‌లు.. పెర్త్‌లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ!