
లార్డ్స్ టెస్టులో భారత్‌పై ఇంగ్లండ్ సంచలన విజయం, జమైకాలో జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేయడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో 24 గంటల వ్యవధిలో రెండు టెస్టు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను అలరించాయి. లార్డ్స్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో టెస్టులో భారత్‌పై 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించగా.. జమైకాలో జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్‌ను 176 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.
204 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ కేవలం 29 పరుగులకే కుప్పకూలింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా విండీస్ రికార్డులకెక్కింది. మరోవైపు భారత్ మాత్రం ఆఖరి వరకు పోరాడి ఓటమి పాలైంది. ఈ రెండు ఫలితాలతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి.
టాప్‌లో ఆసీస్..
ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా 100 విజయ శాతం, 36 పాయింట్లతో డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదేవిధంగా లార్డ్స్ టెస్టులో ఓటమి భారత జట్టుపై గట్టిప్రభావాన్ని చూపింది.
ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో టీమిండియా(33.33 విజయ శాతం) నాలుగో స్ధానానికి పడిపోయింది. అయితే ఈ టెస్టుకు ముందు 50 శాతంతో నాలుగో స్దానంలో ఉన్న ఇంగ్లండ్.. ఇప్పుడు 66.67 విజయశాతంతో భారత్‌ను వెనక్కి నెట్టి రెండో స్ధానానికి దూసుకెళ్లింది.
శ్రీలంకతో సమానంగా విజయం శాతం ఉన్నప్పటికి పాయింట్ల పరంగా ఇంగ్లండ్ ముందుంజలో ఉండడంతో రెండో స్ధానానికి చేరుకుంది. మూడో స్ధానంలో శ్రీలంక కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఖాతాలో 24 పాయింట్లు ఉండగా.. శ్రీలంక వద్ద 16 పాయింట్లు ఉన్నాయి.
చదవండి: IND vs ENG: భారత్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ