మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. పురపాలిక ఎన్నికల్లో బీజేపీ కూటమికి పట్టం కట్టినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ మాట్లాడుతూ "శక్తివంతమైన ప్రజలు ఎన్డీఏ ఎజెండాకు సుపరిపాలనకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏతో ప్రజలు ఏవిధంగా భాగస్వామ్యమయ్యారో చూపుతున్నాయి. ప్రజలందరికీ నా ధన్యవాదాలు" అని మోదీ తెలిపారు.
అదే విధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తను చూసి తాను గర్వపడుతున్నానని మోదీ అన్నారు. మహాయుతి కూటమి రాబోయే రోజుల్లోనూ ఇదే విధమైన ట్రాక్ రికార్డును మెయింటెన్ చేస్తుందని ప్రతిపక్షాల అబద్ధాలను సమర్థవంతంగా తిప్పికొడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ విజయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మన్సిపల్ ఎన్నికల్లో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హిందుత్వ ఎప్పుడు తమ ఆత్మని, హిందుత్వాన్ని అభివృద్ధి నుండి ఎవరూ దూరం చేయలేరని ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో జరిగిన 29 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలలో 25చోట్ల మహాయుతి కూటమి మేయర్ స్థానాన్ని ఏర్పాటు చేయచోతుందని సీఎం ఫడ్నవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతీ కూటమి దూసుకపోతుంది. ముంబైతో సహా 19 కార్పోరేషన్‌లలో స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది.


