న్యూ ఢిల్లీ: 2025 సంవత్సరానికి గాను ఆసియాలోనే అత్యంత సంతోషకరమైన నగరంగా ((Happiest City) భారత వాణిజ్య రాజధాని నగరం ముంబై(Mumbai) టాప్‌లో నిలిచింది. టైమ్ అవుట్ నిర్వహించిన కొత్త సర్వే ప్రకారం, ముంబై తర్వాత చైనా రాజధాని నగరం బీజింగ్, షాంఘై వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. సంస్కృతి, ఆహారం నైట్ లైఫ్, మొత్తం జీవన నాణ్యతతో సహా అనేక అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
థాయిలాండ్‌లోని చియాంగ్ మాయి, తరువాత వియత్నాంలోని హనోయ్, మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. రెండు చైనా నగరాల్లో, 90 శాతం కంటే ఎక్కువ మంది స్థానికులు తమ పరిసరాలలో సంతోషంగా ఉన్నట్లు నివేదించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక గొప్పతనం, యువతకు అనుకూలమైన వాతావరణాలతో, ఈ రెండూ ఆసియా అంతటా ప్రశంసలను దక్కించుకున్నాయి.
టైమ్ అవుట్ సర్వే ప్రకారం 2025కి ఆసియాలోని టాప్ 10 సంతోషకరమైన నగరాలు
1. ముంబై, భారతదేశం
2. బీజింగ్, చైనా
3. షాంఘై, చైనా
4. చియాంగ్ మై, థాయిలాండ్
5. హనోయ్, వియత్నాం
6. జకార్తా, ఇండోనేషియా
7. హాంకాంగ్
8. బ్యాంకాక్, థాయిలాండ్
9. సింగపూర్
10. సియోల్, దక్షిణ కొరియా
ప్రధాన నగరాల్లో 18,000 మందికి పైగా నివాసితులు ఈసర్వేలో పాల్గొన్నారు.ముంబై నివాసితులలో 94 శాతం మంది తమ నగరం తమకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. 89 శాతం మంది స్థానికులు తామున్న మిగతా ప్రదేశాలతో పోలిస్తే ముంబైలో సంతోషంగా ఉన్నారని సర్వే వెల్లడించింది. ఇటీవలి కాలంలో నగరంలో ఆనంద భావన పెరిగిందని 87 శాతం మంది భావించారు.
ఇదీ చదవండి: స్కిన్ కేర్‌పై క్రికెటర్ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?
సంతోషకరమైన ఆసియా నగరాల్ల జాబితాలో లేని ప్రసిద్ధ నగరాలు
సియోల్, సింగపూర్ ,టోక్యోతో సహా ఆసియాలోని అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని గ్లోబల్ సిటీలు సంతోషంలో దిగువ స్థానంలో ఉండటం గమనార్హం. టోక్యో నివాసితులలో 70 శాతం మంది మాత్రమే సంతోషపరుస్తుందని చెప్పారట.


