
2025-26 రంజీ సీజన్ (Ranji Trophy) కోసం 24 మంది ఆటగాళ్లతో కూడిన ముంబై ప్రాబబుల్స్ (Mumbai Ranji Team) జాబితాను ఇవాళ (సెప్టెంబర్ 26) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఎంపికయ్యాడు. అజింక్య రహానే (Ajinkya Rahane) స్థానాన్ని శార్దూల్ ఠాకూర్ భర్తీ చేయనున్నాడు.
రహానే ఈ ఏడాది ఆరంభంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. రహానే ప్రస్తుతం ప్రకటించిన జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగనున్నాడు.
ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), యశస్వి జైస్వాల్‌కు (Yashasvi Jaiswal) చోటు దక్కలేదు. శ్రేయస్ కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఇటీవలే బీసీసీఐకి తెలిపాడు. అందుకే అతన్ని ఎంపిక చేయలేదు. జైస్వాల్ విషయానికొస్తే.. అతను ఇటీవల ముంబై నుంచి గోవాకు మారాలని అనుకున్నాడు. ఆతర్వాత యూటర్న్ తీసుకున్నా ముంబై సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు.
ఈ జట్టులో అన్నదమ్ములు ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan0 చోటు దక్కించుకున్నారు. యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2024–25 సీజన్ సెమీఫైనల్లో విదర్భ చేతిలో ఓడిన ముంబై.. ఈసారి బలమైన స్క్వాడ్‌తో బరిలోకి దిగనుంది.
ముంబై ప్రాబబుల్స్ జాబితా: శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), ఆయుశ్ మాత్రే, ముషీర్ ఖాన్, అంగ్క్రిష్ రఘువంశీ, అఖిల్ హెర్వడ్కర్, అజింక్య రహానే, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేశ్ లాడ్, సువేద్ పార్కర్, సూర్యాంశ్ షెడ్జ్, ఆకాష్ పార్కర్, తుషార్ దేశ్‌పాండే, సిల్వెస్టర్ డిసౌజా, ఇర్ఫాన్ ఉమైర్, రాయ్‌స్టన్ డయాస్, ప్రతిక్ మిశ్రా, ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోరే (వికెట్ కీపర్), ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), షామ్స్ ములాని, తనుష్ కోటియన్, హిమాంశు సింగ్, అథర్వ అంకోలేకర్, ఇషాన్ ముల్చందాని.
చదవండి: Asia cup 2025: పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు