
ముంబై: అమిర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చూసే ఉంటారు కదా. అందులో ఓ సన్నివేశం మీకందరికి గుర్తుండే ఉంటుంది. హీరోయిన్ అక్కకు హీరో ర్యాంచో డెలివరీ చేసి ఆడియన్స్‌ను కంటతడి పెట్టించాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి నిజజీవిత హీరో గురించే..ఈ హృదయ విదారక సంఘటనను ప్రత్యక్ష సాక్షి మంజీత్ ధిల్లాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు
ముంబై ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రసవవేదనతో బాధపడతోంది. తోటి ప్రయాణికులు చోద్యంగా చూస్తున్నారే తప్పా ఎవరూ ముందుకు వచ్చే సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. అదిగో అప్పుడే వందలో ఒక్కడిగా వికాశ్ బింద్రే ముందుకు వచ్చాడు. మహిళను ప్రసవం గురించి ఆరా తీశారు. ఆ తల్లి అప్పటికే ప్రసవ ప్రయత్నంలో ఉందని, సగం బిడ్డ లోపల.. మిగితా సగం శరీరం బయటకు ఉందని గుర్తించాడు. వెంటనే వేగంగా సాగుతున్న ట్రైన్ చైన్‌లాగాడు. ట్రైన్‌లో నుంచి ఫ్లాట్‌ఫారమ్ మీదకు తెచ్చాడు. స్థానికంగా ఆస్పత్రికి సమాచారం అందించాడు. ఆ ఆస్పత్రి వాళ్లు ఆ మహిళకు ప్రసవం చేసేందుకు ముందుకు రాలేదు.
వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ఫోన్ తీసుకుని మహిళా డాక్టర్‌కు (గైనకాలజిస్ట్)కు వీడియో కాల్ చేశాడు. పరిస్థితి వివరించారు. వీడియో కాల్‌లో అవతలి నుంచి డాక్టర్ చెప్పినట్లు చేశాడు. ప్లాట్‌ఫారమ్ మీదనే మహిళకు పురుడు పోశాడు. శభాష్ అనిపించుకున్నాడు. తల్లితో పాటు బిడ్డ సురక్షితంగా ఉన్నారు’ అంటూ మంజీత్ ధిల్లాన్ తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వికాశ్‌కు వైద్య పరిజ్ఞానం లేదు. కానీ మానవత్వం ఉంది. భయపడలేదు. సంకోచించలేదు. ఒక జీవితాన్ని కాపాడాడు. ఇది కేవలం సహాయం కాదు. మానవత్వానికి మచ్చుతునక. అందరూ హీరోలు యూనిఫాంలు ధరించరు. కొందరు మానవత్వం ధరిస్తారు. వికాశ్ బింద్రే అలాంటి వ్యక్తి అంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
"Pata nahi kis roop mein aake Narayan mil jayega"
We have seen in a bollywood movie " 3 idiots " how a delivery of a woman made possible through video call. It is now in reality a brave man helps a woman to have a safe delivery at a railway station on video call at 1 am.
Salute… pic.twitter.com/VSTE4KWJKo— Vishwas (Proud Sanatani & Bhartiya) (@Vishwas1228) October 16, 2025