
న్యూఢిల్లీ: రాబోయే కాలమంతా భారత్‌దే అంటున్నారు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్. ఈ 21 శతాబ్దం అనేది కచ్చితంగా భారత్‌దేనని అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కనీసం నాలుగు నుంచి ఐదు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందన్నారు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్-2025లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన టోనీ అబాట్.. మాట్లాడుతూ.. భారత్‌పై, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.
స్వేచ్ఛా ప్రపంచం అనే మాటకు భారత్‌ను సరైన నిర్వవచనంగా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు నుంచి స్వేచ్ఛా ప్రపంచ నాయకుడు అనే బాధ్యతను భారత ప్రధాని తీసుకోవచ్చని అబోట్ అభిప్రాయపడ్డారు. ఈ 21వ శతాబ్దంలో చైనా ఎలాగైతే ఎదిగిందో అలాగే భారత్ కూడా ఎదుగుతుందన్నారు. కనీసం 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పాటు ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందన్నారు. భారత్ సూపర్‌పవర్‌గా ఆవిష్కృతం కావడానికి ఎంతో సమయం పట్టదన్నారు. ప్రపంచంలో భారత్ సరికొత్త సూపర్‌పవర్ కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు బలమైన ప్రత్యర్థిగా, తమకు నమ్మకమైన భాగస్వామిగా భారత్ కీలక పాత్ర పోషించాలన్నారు. చైనాను ఆర్థికంగా, సైనిక పరంగా అధిగమించే క్రమంలో బారత్ మూడు అతిపెద్ద ప్రయోజాలను కల్గి ఉందన్నారు. అది భారతదేశంలో ప్రజాస్వామ్యం, చట్ట పాలన, ఇంగ్లిష్ అనే ఈ మూడు అంశాలు భారత్ వేగంగా ఎదగడానికి, చైనాను దాటిపోవడానికి కీలకం కాబోతున్నాయన్నారు.
ఇదీ చదవండి:
‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’