
భారత్–శ్రీలంక మైత్రి ఈ ప్రాంతానికి ఎంతో కీలకం: మోదీ
న్యూఢిల్లీ: భారత్–శ్రీలంక దేశాల ఉమ్మడి అభివృద్ధి ప్రయాణంలో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
‘విద్య, మహిళా సాధికా రిత, ఆవిష్కరణలు, అభివృద్ధి సహకారం, భారత మత్స్యకారుల సంక్షేమం వంటి అంశాలపై విస్తృత చర్చలు జరిపాం. సన్నిహిత ఇరుగుపొరుగు దేశాలైన భారత్, శ్రీలంకల మధ్య సహకారం ఈ ప్రాంతానికి, రెండు దేశాల ప్రజల వికాసానికి ఎంతో ముఖ్యమైంది’అని ప్రధాని మోదీ అనంతరం ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఈజిప్టు విదేశాంగ మంత్రితో మోదీ భేటీ
ఈజిప్టు విదేశాంగ మంత్రి డాక్టర్ బదర్ అబ్దెలట్టీతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. గాజా శాంతి ఒప్పందం కార్యరూపం దాల్చడంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.