పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులకు కచ్చితంగా కొన్ని సూత్రాలను పాటించాలి. తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదనే ఉద్దేశంతో వాళ్లకి ఏ కష్టం తెలియకుండా, అడిగిందల్లా క్షణాల్లో కళ్ల ముందర ఉంచుతూ, కాలు కందకుండా పెంచాలని భావిస్తుంటారు. నిజానికి ఈ విధానం వల్ల పిల్లల్లో సోమరితనం, కష్టపడి సాధించాలనే తపన సామర్థ్యం, తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయంటారు చైల్డ్ సైకియాట్రిస్టులు. అందుకే పిల్లలకు బాల్యం నుంచే శ్రమ విలువ, గౌరవం తెలిసేలా చేయాలి. ఒక విదేశీ మహిళ, తన బిడ్డలతో ఇలానే చేస్తోంది అంటే నమ్ముతారా? దీనికి సంబంధించి ఒక వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది.
‘వోనీ_బ్రదర్స్' అనే ఇన్‌స్టా ఖాతాలో భారతీయ పనిపద్ధతులు, జీవనశైలిని కొరియన్ కుటుంబానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీని ప్రకారం వివిధ భారతీయ అనుభవాలు, ఆహారాలు, లేదా ప్రయాణ విశేషాలు కాకుండా ఆ కుటుంబం తమ పిల్లలకు చేతులతో బట్టలు ఉతకడంలో ఉండే కష్టాన్ని చూపించాలని నిర్ణయించుకుంది. అలా ఇద్దరు చిన్న కొరియన్ పిల్లలు ముంబైలోని ప్రసిద్ధ ధోబీ ఘాట్‌కి వచ్చి, మురికి బట్టలకు బండకేసి బాది ఉతికారు. తల్లి కూడా దగ్గరే నిలబడి, వారితో పాటు బట్టలు ఉతకడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి ముందు అక్కడి కార్మికులు బట్టలను శుభ్రం చేయడం, ఉతకడం లాంటి పనులను పిల్లలు జాగ్రత్తగా పరిశీలించడం విశేషం. "ధోబీ ఘాట్‌లో కొరియన్ పిల్లలు. నిజమైన భారతీయ జీవితాన్ని గడుపుతున్నారు. ధోబీ ఘాట్. నిజమైన పని, నిజమైన గౌరవం," అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.
> ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్
కాగా వోనీ_బ్రదర్స్ భారతదేశంలో మొదటిసారిగా పానీ పూరీని ప్రయత్నించిన వీడియో వైరల్ అయింది. అలాగే ఈ బ్రదర్స్‌లో ఒకరు సూపర్ సింగర్ జూనియర్ 9 పోటీదారు మైత్రేయన్‌తో కలిసి "కనిమా"అనే తమిళ పాటకు డాన్స్ చేస్తూ ఆన్‌లైన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించారు. దీనిపై ఇది కేవలం రీల్స్ కోసం చేసినట్లు అనిపించవచ్చు గానీ, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే ఒక జీవిత పాఠం. దీనిని తేలికగా తీసుకోకూడదు," అని వ్యాఖ్యానించారు.


