ముంబై: ముంబైలో 20మంది పిల్లల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆడిషన్స్ పేరుతో కిడ్నాప్‌కు గురైన 20మంది పిల్లల్ని పోలీసులు కాపాడారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గన్‌తో పాటు పలు రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు.
మీరు పేపర్లు,టీవీలు,సోషల్ మీడియాలో కొన్ని ప్రకటనలు చూస్తూనే ఉంటారు. వాటిలో మనల్ని ఎక్కువగా ‘మా సంస్థ నిర్మిస్తున్న సీరియల్స్‌లో నటినటులు కావాలని, లేదంటే మా సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రకు బాలనటులు కావాలంటూ వచ్చే ప్రకటనలు ఆకర్షిస్తుంటాయి. అదిగో అలాంటి ప్రకటనే ఇచ్చిన ఓ కిడ్నాపర్ ఓ 20మంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడు.
సినిమా,డైలీ సీరియల్స్,వెబ్ సిరీస్‌లో బాల నటీనటులు కావాలంటూ కిడ్నాపర్ రోహిత్ ఆర్య ఓ యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్ చూసిన 100 మంది పిల్లలు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ప్రముఖ నివాస ప్రాంతం ‘పోవై’ ఆర్‌ఏ స్టూడియోకు తరలివచ్చారు. ఆడిషన్స్ ఇచ్చేందుకు వచ్చిన 100 మంది పిల్లలో 20మంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. వీరి వయస్సు 15లోపే ఉంటుందని సమాచారం.
అయితే పిల్లల్ని బంధించిన అనంతరం ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో కిడ్నాపర్ రోహిత్ ఆర్య మాట్లాడుతూ.. ‘నావి మామూలు డిమాండ్లే. నేను కొంతమందిని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. వాళ్ల నుంచి నాకు జవాబు కావాలి. నేను ముందుగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ప్లాన్ మార్చి పిల్లల్ని కిడ్నాప్ చేశా. ఈ వీడియో చూసిన తర్వాత పిల్లల్ని రక్షించాలని పోలీసులు ఏదైనా ప్రయోగం చేస్తే ఈ ప్రదేశాన్ని తగలబెడతా. డబ్బును ఆశించడం లేదు. అలాగని ఉగ్రవాదిని కూడా కాదు’ అంటూ బెదిరింపులకు దిగాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టూడియో పరిసర ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడి చెరలో ఉన్న పిల్లలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చాకచక్యంగా వ్యహరించారు. స్టూడియోలోకి ప్రవేశించి పిల్లల్ని రక్షించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో రోహిత్ ఆర్య మానస్థిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
Man holds 15–20 children hostage at a studio in Mumbai’s Powai and released a video saying he wants to speak with specific people and be allowed to meet them.
In the video, he threatened that if he’s not permitted to do so, he will set the studio on fire and harm himself and the… pic.twitter.com/UWG6Th95n9— The Tatva (@thetatvaindia) October 30, 2025


