కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న భారత్‌ | India Vs South Africa Womens World Cup 2025 Finals Live Score Updates, Top News Headlines, Highlights And Videos | Sakshi
Sakshi News home page

IND W Vs SA W Updates: కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న భారత్‌

Nov 2 2025 3:11 PM | Updated on Nov 2 2025 9:15 PM

India vs South Africa Womens World Cup 2025 Final Live Updates

India vs South Africa Womens WC 2025 Final Live Updates: మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌-2025 ఫైన‌ల్లో భాగంగా నవీ ముంబై వేదికగా భార‌త్‌-సౌతాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. 

కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న భారత్‌
299 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 4 ఓవర్లు ముగిసే సరికి 12 పరుగులు చేసింది. క్రీజులో లారా వోల్వడర్ట్‌(3), బ్రిట్స్‌(6) ఉన్నారు. భారత పేసర్లు రేణుకా సింగ్‌, క్రాంతి గౌడ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు.

సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌..
న‌వీ ముంబై వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న ఫైన‌ల్లో భార‌త బ్యాట‌ర్లు చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 298 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీప్తి శర్మ(58 బంతుల్లో 58), రిచా ఘోష్‌(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), మంధాన(45) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. మలాబా, క్లార్క్‌, ట్రయాన్‌ తలా వికెట్‌ సాధించారు.

దీప్తి శర్మ హాఫ్‌ సెంచరీ..
దీప్తి శర్మ 53 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది.  48 ఓవ‌ర్లు ముగిసే సరికి  భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 286 ప‌రుగులు చేసింది. క్రీజులో రిచా(33), దీప్తి(50) ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న రిచా..
క్రీజులోకి వ‌చ్చిన రిచా ఘోష్(25) దూకుడుగా ఆడుతోంది.  47 ఓవ‌ర్లు ముగిసే సరికి  భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 277 ప‌రుగులు చేసింది. క్రీజులో రిచాతో పాటు దీప్తి(49) ఉన్నారు.

టీమిండియా ఐదో వికెట్‌ డౌన్‌
అమన్‌జ్యోత్‌ కౌర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అమన్‌జ్యోత్‌.. డిక్లార్క్ బౌలింగ్‌లో ఔటైంది. క్రీజులోకి రిచాఘోష్ వచ్చింది. రిచా వచ్చిన వెంటనే సిక్సర్‌తో తన ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. 44 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 253/5

టీమిండియా నాలుగో వికెట్ డౌన్‌..
హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ రూపంలో భార‌త్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 ప‌రుగులు చేసిన హ‌ర్మ‌న్‌.. మలాబా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 39 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ 4 వికెట్లు కోల్పోయి 223 ప‌రుగులు చేసింది. క్రీజులోకి అమ‌న్‌జ్యోత్ కౌర్ వ‌చ్చింది.

నిల‌క‌డ‌గా ఆడుతున్న హ‌ర్మ‌న్‌, దీప్తి
37 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్  మూడు వికెట్ల న‌ష్టానికి 211 ప‌రుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్‌(17), దీప్తి శ‌ర్మ‌(25) ఉన్నారు.
భారత్‌కు భారీ షాక్‌.. రోడ్రిగ్స్ ఔట్‌
టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. సెమీస్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడిన రోడ్రిగ్స్‌.. ఫైనల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయింది. 24 పరుగులు చేసిన రోడ్రిగ్స్‌, ఖాఖా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది.

షెఫాలీ వర్మ ఔట్‌..
షెఫాలీ వర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 87 పరుగులు చేసిన.. ఖాఖా బౌలింగ్‌లో ఔటైంది.  29 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 167/2గా ఉంది. 

సెంచరీ దిశగా సాగుతున్న షఫాలీ
షఫాలీ వర్మ సెంచరీ దిశగా సాగుతుంది. 74 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. షఫాలీకి జతగా జెమీమా (21) క్రీజ్‌లో ఉంది. 27 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 162/1గా ఉంది. 

షెఫాలీ వర్మ ఫిప్టీ..
ఫైనల్‌ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడుతోంది. షెఫాలీ 49 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకుంది. 20 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 114/1

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..
భారత మహిళల జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. 45 పరుగులు చేసిన మంధాన.. ట్రయాన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటైంది. క్రీజులోకి జెమీమా రోడ్రిగ్స్‌ వచ్చింది.

17 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 97/0
17 ఓవర్లు ముగిసే సరికి భారత మహిళల జట్టు వికెట్‌ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(45 బంతుల్లో  48), మంధాన(51 బంతుల్లో 39) ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు..
10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా 64 ప‌రుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(29), మం‍ధాన(27) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న షెఫాలీ..
5 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(21), మం‍ధాన(7) ఉన్నారు.

2 ఓవర్లు భారత్ స్కోర్‌: 7/0
2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా 7 ప‌రుగులు చేసింది. క్రీజులో ఓపెన‌ర్లు స్మృతి మంధాన(1), షెఫాలీ వర్మ(5) ఉన్నారు.

బ్యాటింగ్‌ భారత్‌దే..
డివై పాటిల్‌ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్‌ లారా లారా వోల్వార్డ్ట్ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్‌లో ఆడిన జట్టునే కొనసాగించాయి.
తుది జట్లు
భారత్‌ : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్‌), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్

దక్షిణాఫ్రికా : లారా వోల్వార్డ్ట్(కెప్టెన్‌), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్‌), అన్నరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా,  మ్లాబా

తగ్గిన వర్షం..
నవీ ముంబైలో వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. 4:30 గంటలకు టాస్‌ పడనుంది. సాయంత్రం ఐదు గంటలకు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

ఐసీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌-2025 ఫైన‌ల్‌కు రంగం సిద్ద‌మైంది. న‌వీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదిక‌గా భార‌త్‌-సౌతాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. అయితే ఈ తుది పోరుకు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం టాస్ 2.30 గంటలకు ప‌డాల్సిన టాస్ ఆల‌స్యం కానుంది.

కాగా సౌతాఫ్రికాకు ఇది తొలి వరల్డ్‌కప్‌ ఫైనల్‌ కాగా.. హర్మన్‌ సేన ఫైనల్‌ అర్హత సాధించడం ఇది మూడోసారి. అయితే ఈసారి మహిళల క్రికెట్‌లో సరికొత్త చాంపియన్‌ను చూడబోతున్నాము. ఎందుకంటే భారత్‌ కానీ, సౌతాఫ్రికా కానీ ఒక్కసారి కూడా వరల్డ్‌కప్‌ ట్రోఫీని గెలుచుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement