8న బ్రిటిష్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాక | UK Prime Minister Starmer to visit India from 8 October 2025 | Sakshi
Sakshi News home page

8న బ్రిటిష్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాక

Oct 5 2025 6:32 AM | Updated on Oct 5 2025 6:32 AM

UK Prime Minister Starmer to visit India from 8 October 2025

న్యూఢిల్లీ: బ్రిటిష్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ నెల 9న ముంబైలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమవుతారు. విజన్‌–2035 రోడ్‌మ్యాప్‌లో భాగంగా భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి చేపట్టిన చర్యల పురోగతిని వారు సమీక్షిస్తారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తారు. ముంబైలో గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో స్టార్మర్‌ ప్రసంగిస్తారు. స్టార్మర్‌ గత ఏడాది జూలైలో బ్రిటిష్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. 

Advertisement
 
Advertisement
Advertisement