మళ్లీ మొద‌టికి వ‌చ్చావా పృథ్వీ..? ఆటగాళ్లతో గొడవ! వీడియో | Prithvi Shaw loses cool after century vs Mumbai | Sakshi
Sakshi News home page

మళ్లీ మొద‌టికి వ‌చ్చావా పృథ్వీ..? ఆటగాళ్లతో గొడవ! వీడియో

Oct 7 2025 6:16 PM | Updated on Oct 7 2025 7:29 PM

Prithvi Shaw loses cool after century vs Mumbai

రంజీ ట్రోఫీ 2025-26 సీజ‌న్‌కు ముందు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మ‌హారాష్ట్ర‌, ముంబై జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి.  ఈ మ్యాచ్‌లో తన మాజీ జట్టుపై మహారాష్ట్ర బ్యాట‌ర్ పృథ్వీషా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.

షా కేవలం 140 బంతుల్లోనే 100 పరుగుల మార్కును చేరుకున్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ ఒకప్పటి పృథ్వీషాను గుర్తు చేశాడు. దూకుడుగా ఆడిన షా మొత్తంగా 181 పరుగులు సాధించి అవుటయ్యాడు. మరో యువ ఆటగాడు అర్షిన్‌ కులకర్ణితో కలిసి 305 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఆఖరికి భారీ షాట్‌కు ప్రయత్నించి షామ్స్‌ ములానీ బౌలింగ్‌లో పృథ్వీ ఔటయ్యాడు. ఇక్కడవరకు అంతా బాగానే ఉన్న ఔటయ్యి డగౌట్‌కు వెళ్లే క్రమంలో పృథ్వీషా.. ముంబై ఆటగాళ్లతో  తీవ్ర వాగ్వాదానికి దిగాడు. పృథ్వీ ఔటయ్యాక ముంబై ఆల్‌రౌండ‌ర్ ముషీర్ ఖాన్  ఏదో అన్నాడు. 

దీంతో సహనం కోల్పోయిన పృథ్వీ.. ముషీర్ వద్దకు వెళ్లి తన నోటికి పనిచెప్పాడు. ఆ తర్వాత షమ్సీ ములానీతో కూడా షా గొడవపడ్డాడు. అంపైర్‌లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

ఇది చూసిన నెటిజన్లు పృథ్వీ ఇది నీకు అవసరమా.. మళ్లీ మొదటకు వచ్చావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాబోయే రంజీ సీజన్‌కు ముందు పృథ్వీ షా తన మకాంను ముంబై నుంచి మహారాష్ట్రకు మార్చిన సంగతి తెలిసిందే. పేలవ ఫామ్‌, సరైన క్రమశిక్షణ లేకపోవడంతో ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అతడిని పక్కన పెట్టింది. 

దీంతో మహారాష్ట్ర జట్టుకు పృథ్వీ వెళ్లిపోయాడు. అక్కడకు వెళ్లినా కూడా అతడి తీరు మారలేదు. ముంబై 25 ఏళ్ల పృథ్వీ షా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటికి 58 మ్యాచ్‌లు ఆడి సగటు 46.02తో 4556 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 379గా ఉంది.
చదవండి: ఆసియాక‌ప్‌లో అట్ట‌ర్ ప్లాప్‌.. పాక్ కెప్టెన్‌పై వేటు!?


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement