ముంబై మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే బీజేపీ కూటమి బృహాత్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఠాక్రేల చేతిలో ఉన్న ముంబై మేయర్ పీఠం తొలిసారిగా వారి చేజారనున్నట్లు ఫలితాల ట్రెండ్ స్పష్టం చేస్తోంది.
ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు మెుత్తం 227 స్థానాలుండగా బీజేపీ 88 స్థానాలు, శివసేన శిండే(28 స్థానాల్లో అధిక్యంలో ఉంది. శివసేన (ఠాక్రే) 74 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో మహాయుతి కూటమి స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. మెుత్తంగా మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగగా బీజేపీ 19 చోట్ల స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. సాయంత్రం 5 గంటలకు అందిన నివేదికల ప్రకారం మెుత్తంగా 2,869 స్థానాలలో మహాయుతి కూటమి 1600 స్థానాల్లో అధిక్యం దూసుకపోతుంది.
మెుత్తంగా పార్టీల వారిగా
బీజేపీ:1304
శివసేన (శిండే): 363
కాంగ్రెస్ : 278
శివసేన (ఠాక్రే):151
ఎన్సీపీ : 127
ఎంఐఎం: 77
ఇతరులు: 278
అయితే ఈ ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరాఠా ప్రజలు ఆశీర్వదించారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మహారాష్ట్రలో వచ్చే 20-25 ఏళ్ల పాటు బీజేపీ పాలిస్తుందని తెలిపారు. మహాయుతి కూటమిపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలు ఉదాహరణ అని ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తెలిపారు.


