బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నాయకుడు గోవిందా(61) ఆస్పత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆయన ఉన్నట్లుండి స్పృహ కోల్పోయారని ఆయన స్నేహితుడు లలిత్ బిందాల్ మీడియాకు తెలిపారు. జుహులోని తన ఇంటికి సమీపంలో ఉన్న క్రిటికేర్ ఆసుపత్రిలో గోవిందా చికిత్స పొందుతున్నారని చెప్పారు. గోవిందాకు చాలా రక్త పరీక్షలు చేయించామని నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన అన్నారు. కానీ, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని క్లారిటీ ఇచ్చారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.


