
స్వదేశంలో భారత అండర్-19 జట్టుతో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా అండర్-19 జట్టును నిన్న (ఆగస్ట్ 7) ప్రకటించారు. ఈ జట్టులో ఇద్దరు భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూసౌత్ వేల్స్‌కు ప్రాతినిథ్యం వహించే యశ్ దేశ్‌ముఖ్, విక్టోరియాకు ఆడే ఆర్యన్ శర్మ ఈ జట్టుకు ఎంపికయ్యారు.
వీరిలో దేశ్‌ముఖ్ స్పిన్నర్ కాగా.. ఆర్యన్ శర్మ వికెట్ కీపర్ బ్యాటర్. ఆర్యన్ శర్మ విక్టోరియా తరఫున 31 మ్యాచ్‌ల్లో సత్తా చాటి జట్టులోకి రాగా.. దేశ్‌ముఖ్ 2024/25 అండర్-17 నేషనల్ ఛాంపియన్స్ లీగ్‌లో చెలరేగి జట్టులో ఈ జట్టుకు ఎంపికయ్యాడు.
ఆసీస్ అండర్-19 జట్టు ఆయుశ్ మాత్రే నేతృత్వంలోని భారత్ అండర్-19 జట్టుతో తలపడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలుత మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లు, ఆతర్వాత రెండు 4 రోజుల మ్యాచ్‌లు జరుగనున్నాయి.
భారత అండర్-19 జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు..
సైమన్ బడ్జ్, అలెక్స్ టర్నర్, స్టీవ్ హోగన్, విల్ మలాజ్‌చుక్, యశ్ దేశ్‌ముఖ్, టామ్ హోగన్, ఆర్యన్ శర్మ, జాన్ జేమ్స్, హేడెన్ స్కిల్లర్, చార్లెస్ లచ్‌మండ్, బెన్ గార్డన్, విల్ బైరోమ్, కేసీ బార్టన్, అలెక్స్ లీ యంగ్, జేడన్ డ్రేపర్
రిజర్వ్ ఆటగాళ్లు: జెడ్ హోల్లిక్, టామ్ పాడింగ్టన్, జూలియన్ ఓస్‌బోర్న్
షెడ్యూల్..
సెప్టెంబర్ 21- తొలి వన్డే (బ్రిస్బేన్)
సెప్టెంబర్ 24- రెండో వన్డే (బ్రిస్బేన్)
సెప్టెంబర్ 26- మూడో వన్డే (బ్రిస్బేన్)
సెప్టెంబర్ 20- అక్టోబర్ 3 వరకు- తొలి టెస్ట్ (బ్రిస్బేన్)
అక్టోబర్ 7-10- రెండో టెస్ట్ (మెక్‌కే)
ఈ సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు..
ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్‌కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్‌కీపర్), ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, డి దీపేష్, కిషన్ కుమార్, అన్మోలన్‌జీత్, ఖిలన్ పటేల్, ఉద్దవ్ మోహన్, అమన్ చౌహాన్