
భారత క్రికెట్‌లో గత కొంతకాలంగా ఇద్దరు యువ ఆటగాళ్ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. ఒకరు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi ).. మరొకరు ఆయుశ్ మాత్రే. ఐపీఎల్-2025 (IPL) సందర్భంగా అరంగేట్రం చేసిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ.. రాజస్తాన్ రాయల్స్ తరఫున సత్తా చాటాడు.
చిచ్చర పిడుగు
కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి.. అత్యంత పిన్న వయసులో క్యాష్ రిచ్‌లీగ్‌లో శతక్కొట్టిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు వైభవ్. సంజూ శాంసన్ గైర్హాజరీలో రాయల్స్ ఓపెనర్‌గా రాణించాడు. మరోవైపు.. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టి.. అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
ఆయుశ్ ధనాధన్
ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆయుశ్ ఏడు ఇన్నింగ్స్‌ఆడి 240 పరుగులు సాధించాడు. ఇందులో ఓ భారీ హాఫ్ సెంచరీ (94) ఉంది. శతకం చేసే అవకాశం చేజారినా అద్భుత ప్రదర్శనతో ఆయుశ్ ఆకట్టుకున్నాడంటూ అతడిపై ప్రశంసలు కురిశాయి.
ఇంగ్లండ్ పర్యటనలో ఇరగదీసిన వైభవ్
ఇక ఐపీఎల్ తర్వాత ఈ ఇద్దరూ భారత్ అండర్-19 క్రికెట్ తరఫునా దుమ్ములేపారు. ఆయుశ్ మాత్రే కెప్టెన్సీలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వైభవ్ యూత్ వన్డేల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇందులో ఓ ఫాస్టెస్ట్ సెంచరీ (52 బంతుల్లో) కూడా ఉండటం విశేషం.
సెంచరీతో చెలరేగిన కెప్టెన్
మరోవైపు.. ఇంగ్లండ్‌తో అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆయుశ్ సెంచరీతో అలరించాడు. ఇలా ఈ ఇద్దరూ ఇంగ్లండ్ టూర్‌లోనూ సత్తా చాటి తమను తాము మరోసారి నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా వైభవ్, ఆయుశ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు!
శుభంకర్ మిశ్రాతో మాట్లాడుతున్న క్రమంలో.. ‘వైభవ్- ఆయుశ్.. ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా టీమిండియాలోకి వస్తారు?’ అనే ప్రశ్న రైనాకు ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా వైభవ్ సూర్యవంశీనే. ఏమాత్రం భయం లేకుండా.. దూకుడుగా ఆడే అతడి శైలి భిన్నంగా ఉంటుంది.
తొలుత ఐపీఎల్‌లో.. తర్వాత ఇంగ్లండ్‌లో యూత్ వన్డేలో అతడు శతకాలు బాదాడు. బిహారీలు ఇలాగే ఉంటారు. బిహార్ నుంచి వచ్చేవాళ్లు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటారు. నిజానికి వైభవ్ రాకమునుపు సమస్తిపూర్ అనే గ్రామం ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆ గ్రామం నుంచి వచ్చిన వైభవ్ సత్తా ఏమిటో ప్రపంచం చూస్తోంది.
ఇలాంటి ప్లేయర్లు శతాబ్దానికి ఒక్కరే ఉంటారు. రిషభ్ పంత్, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్.. పదిహేడేళ్ల ఆయుశ్ మాత్రే.. ఇలా ఎవరికి వారే ప్రత్యేకం. ఆయుశ్ కూడా తొలి మ్యాచ్ నుంచే ఆకట్టుకున్నాడు’’ అని సురేశ్ రైనా పేర్కొన్నాడు.
చదవండి: రాజస్తాన్ రాయల్స్‌కు ద్రవిడ్ గుడ్‌బై.. అధికారిక ప్రకటన విడుదల