హర్భజన్ సింగ్ రీఎంట్రీ | Harbhajan Singh Returns To Competitive Cricket With Aspin Stallions For Abu Dhabi T10 League, More Details Inside | Sakshi
Sakshi News home page

హర్భజన్ సింగ్ రీఎంట్రీ

Oct 16 2025 2:58 PM | Updated on Oct 16 2025 3:45 PM

Harbhajan Singh returns to competitive cricket with Aspin Stallions for Abu Dhabi T10 League

టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కాంపిటేటివ్‌ క్రికెట్‌లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నాడు. త్వరలో ప్రారంభం కాబోయే అబుదాబీ టీ10 లీగ్‌లో (Abu Dhabi T10 League) అస్పిన్‌ స్టాల్లియన్స్‌ (Aspin Stallions) అనే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించన్నాడు.

2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్.. ఇటీవల వరల్డ్‌ ఛాంపియన్షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీలో (World Championship of Legends) ఇండియా ఛాంపియన్స్ తరఫున బరిలోకి దిగాడు. పాకిస్తాన్‌తో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆ టోర్నీ సెమీ ఫైనల్లోనే భారత్‌ వాకౌట్‌ చేసింది.

ఆ మధ్యలోనూ హర్భజన్ పలు ఫ్రాంచైజీ బేస్డ్‌ టోర్నీలు ఆడాడు. హర్భజన్‌కు అబుదాబీ లీగ్‌ కొత్తే అయినా, టి10 ఫార్మాట్ మాత్రం పరిచయమే. 2023లో అతను  అమెరికాలో జరిగిన యూఎస్‌ మాస్టర్స్‌ టీ10 లీగ్‌లో (US Masters T10 League) ఆడాడు. ఆ టోర్నీలో అతను మోరిస్విల్లే యూనిటీ తరఫున బరిలోకి దిగాడు.

అబుదాబీ టీ10 లీగ్‌లో హర్భజన్ ప్రాతినిథ్యం వహించబోయే ఫ్రాంచైజీ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుతం యూఏఈ ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు అయిన అహ్మద్‌ ఖూరీకి (Ahmad Khoori) చెందింది.

2017 పురుడు పోసుకున్న అబుదాబీ టీ10 లీగ్‌లో ఈసారి Aspin Stallionsతో పాటు మరికొన్ని కొత్త ఫ్రాంచైజీలు (Vista Riders, Ajman Titans, Royal Champs) పరిచయం కానున్నాయి. ఈ టోర్నీ నవంబర్ 18 నుంచి 30 వరకు అబుదాబిలో జరుగనుంది.

Aspin Stallionsలో హర్భజన్‌తో పాటు మరికొంత మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ సామ్ బిల్లింగ్స్, ఇంగ్లండ్‌ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టైమల్ మిల్స్, వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఆండ్రే ఫ్లెచర్, శ్రీలంక ఆటగాళ్లు అవిష్క ఫెర్నాండో, బినురా ఫెర్నాండో, యూఏఈ ఆటగాడు జోహైర్ ఇక్బాల్ ఈ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు.

చదవండి: IND vs AUS: గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement