
ఇంగ్లండ్ పర్యటనలో భారత అండర్-19 కెప్టెన్ ఆయూష్ మాత్రే ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్-19 జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయూష్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రమే వన్డే తరహాలో కేవలం 107 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 115 బంతులు ఎదుర్కొన్న మాత్రే.. 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆరంభంలోనే టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వికెట్‌ను కోల్పోయింది.
14 పరుగులు చేసిన సూర్యవంశీ.. అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో ఆయుష్ మాత్రే తన అద్భుత బ్యాటింగ్‌తో ముందుండి నడిపించాడు. నంబర్ త్రీ బ్యాటర్ విహాన్ మల్హోత్రాతో కలిసి మూడో వికెట్‌కు 173 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
తన సూపర్ బ్యాటింగ్‌తో ఇంగ్లీష్ జట్టు బౌలర్ల సహనాన్ని ఈ సీఎస్‌కే బ్యాటర్ పరీక్షించాడు. 50 ఓవర్లు ముగిసే సరికి యువ భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. క్రీజులో అభిజ్ఞాన్ కుండు(33), రాహుల్ కుమార్(32) ఉన్నారు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
Ayush Mhatre 💯 💥👏👏pic.twitter.com/fQxUEU707v
— м α н ι z н α ηメ🐘ᵀⱽᴷ (@_Mahizhan) July 12, 2025