
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆయుశ్ మాత్రే సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేస్తున్నాడు.
మాత్రే ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మాత్రే 17 ఏళ్ల 278 రోజుల వయసులో సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేశాడు. మాత్రేకు ముందు ఈ రికార్డు అభినవ్ ముకుంద్ పేరిట ఉండేది. ముకుంద్ 18 ఏళ్ల 139 రోజుల వయసులో సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేశాడు.
ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులైన ఆటగాళ్ళు
17y 278d - ఆయుశ్ మాత్రే vs MI, వాంఖడే, 2025*
18y 139d - అభినవ్ ముకుంద్ vs RR, చెన్నై, 2008
19y 123d - అంకిత్ రాజ్‌పూత్ vs MI, చెన్నై, 2013
19y 148d - మతీష పతిరన vs GT, వాంఖడే, 2022
20y 79d - నూర్ అహ్మద్ vs MI, చెన్నై, 2025
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 16 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్ ఇచ్చి రచిన్ రవీంద్ర (5) ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్‌లోనే ఇరగదీశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
#RRvLSG: 14-year-old Vaibhav Suryavanshi's first three balls vs LSG on IPL debut: 𝐒𝐈𝐗, 1 RUN, 𝐒𝐈𝐗,#MIvCSK: 17-year-old Ayush Mhatre's first four balls vs MI on IPL debut: 1 RUN, 𝗙𝗢𝗨𝗥, 𝐒𝐈𝐗, 𝐒𝐈𝐗,
WHAT A WAY TO ANNOUNCE YOUR ARRIVAL! | 📸: JioStar pic.twitter.com/WRVTwqEt2f— CricTracker (@Cricketracker) April 20, 2025
6.5 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్‌కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) ఎలా రెచ్చిపోయాడో, ఈ మ్యాచ్‌లో ఆయుశ్ మాత్రే కూడా అలాగే ఇరగదీశాడు. సూర్యవంశీ తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు.