ఐపీఎల్ 2025లో నిరాశజనక ప్రదర్శన తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) తమ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను తప్పించింది. తాజాగా పండిట్ స్థానాన్ని మాజీ ముంబై ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌తో (Abhishek Nayar) భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ నిర్ణయాన్ని గత వారం నాయర్‌కు తెలియజేసినట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
నాయర్ గతంలో కేకేఆర్ అకాడమీకి కీలకంగా పనిచేశాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను వెలికితీయడంలో అతని పాత్ర ముఖ్యమైంది. గత సంవత్సరం సహాయక సిబ్బందిగా కేకేఆర్‌లో చేరిన నాయర్, ఇప్పుడు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
42 ఏళ్ల నాయర్, ఇటీవల మహిళల ఐపీఎల్‌లో (WPL) యూపీ వారియర్జ్‌కు (UP Warriorz) హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అతని కోచింగ్ శైలి వ్యక్తిగతంగా ఆటగాళ్లను ఫిట్‌నెస్, ఫామ్ పరంగా తిరిగి పుంజుకునేలా చేస్తుంది.
నాయర్ ఇటీవలే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మలో (Rohit Sharma) ఊహించిన ఫిట్‌నెస్ పరివర్తను తీసుకొచ్చాడు. నాయర్ సహకారంతో రోహిత్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు. నాయర్ రోహిత్‌కు మంచి మిత్రుడు కూడా. నాయర్ రోహిత్‌కు మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్ తదితర ఆటగాళ్లకు కూడా ఫిట్‌నెస్ గురుగా ఉన్నాడు.
వ్యక్తిగత కోచ్‌గా, ఫిట్‌నెస్ గురుగా మంచి పేరున్న నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా మాత్రం రాణించలేకపోయాడు. ఇటీవలే బీసీసీఐ అతన్ని ఆ పదవి నుంచి తప్పించింది. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ నియమితుడయ్యాక నాయర్‌ను ప్రత్యేకంగా తన బృందంలో చేర్చుకున్నాడు. అయితే జట్టు వైఫల్యాల కారణంగా నాయర్ ఎంతో కాలం భారత సహాయ కోచ్‌గా ఉండలేకపోయాడు.
ఇదిలా ఉంటే, గత సీజన్‌లో కేకేఆర్ పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలు మాత్రమే సాధించి, ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. తదుపరి సీజన్‌లో కేకేఆర్ నాయర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. కేకేఆర్ హెడ్ కోచ్ పదవిపై అధికారిక ప్రకటన వచ్చాక నాయర్ యూపీ వారియర్జ్ కోచ్‌గా కూడా కొనసాగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
చదవండి: చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్


