ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి పుంజుకున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఎనిమిది పరుగులే చేసిన ‘హిట్‌మ్యాన్’.. రెండో వన్డేలో మాత్రం రాణించాడు.
అడిలైడ్ (IND vs AUS 2nd ODI)లో గురువారం నాటి మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. అర్ధ శతకం సాధించాడు. డెబ్బై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొని 73 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉన్నాయి.
సరికొత్త చరిత్ర
ఇక రోహిత్ బాదిన రెండు సిక్సర్లు కూడా భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వచ్చినవే. ఆసీస్ పేసర్ మిచెల్ ఓవెన్ బౌలింగ్‌లో తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన హిట్‌మ్యాన్.. మూడో బంతిని కూడా బౌండరీ మీదుగా తరలించాడు. అయితే, తొలి సిక్సర్‌తోనే రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 సిక్సర్లు బాదిన ఆసియా తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు రో‘హిట్’ శర్మ SENA దేశాల్లో మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచ్‌లు ఆడి 151 సిక్సర్లు బాదడం విశేషం.
Oh my word! 🤩@ImRo45 is back to his very best. Just what #TeamIndia needed. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/P95TUGWl95
— Star Sports (@StarSportsIndia) October 23, 2025
SENA దేశాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆసియా క్రికెటర్లు
🏏రోహిత్ శర్మ (ఇండియా)- 156 మ్యాచ్‌లలో 151*
🏏సనత్ జయసూర్య (శ్రీలంక)- 171 మ్యాచ్‌లలో 113
🏏షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్)- 139 మ్యాచ్‌లలో 105
🏏మహేంద్ర సింగ్ ధోని (ఇండియా)- 175 మ్యాచ్‌లలో 83
🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 177 మ్యాచ్‌లలో 83.
👉ఇదిలా ఉంటే.. శ్రేయస్ అయ్యర్ (61)తో కలిసి మూడో వికెట్‌కు 118 పరుగులు జతచేసిన రోహిత్ శర్మ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రోహిత్, శ్రేయస్ అర్ధ శతకాలకు తోడు అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది.
చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా?


