Australia vs India, 3rd ODI Updates And Highlights: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియాతో నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
36.2: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ వీరుడు మ్యాట్ రెన్షా (56) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఎల్‌బీడబ్ల్యూ విషయంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా.. బంతి లెగ్ స్టంప్‌ను హిట్ చేస్తున్నట్లుగా తేలింది. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోగా.. మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. 37 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 197-5. కన్నోలి 6 పరుగులతో ఉన్నాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
33.4: హర్షిత్ రాణా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి క్యారీ (24) అవుట్. అద్భుతమైన క్యాచ్‌తో మెరిసి టీమిండియా కీలక వికెట్ పొందడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్ గాయపడినట్లు తెలుస్తోంది. కూపర్ కన్నోలి క్రీజులోకి రాగా 34 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు: 184-4. రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్
22.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి మాథ్యూ షార్ట్ అవుటయ్యాడు. 41 బంతుల్లో 30 పరుగులు చేసి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అలెక్స్ క్యారీ క్రీజులోకి వచ్చాడు. 24 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. రెన్షా 22, క్యారీ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ డౌన్
15.1: మార్ష్ (41) రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మార్ష్ బౌల్డ్ అయ్యాడు. మ్యాట్ రెన్షా క్రీజులోకి రాగా.. షార్ట్ 11 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 92-2 (16)
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
9.2: సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ట్రావిస్ హెడ్. 25 బంతులు ఎదుర్కొని 29 పరుగుల చేసిన హెడ్ అవుట్. ఫలితంగా తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. మాథ్యూ షార్ట్ క్రీజులోకి రాగా.. మార్ష్ 25 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 63-1
ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 26-0(5)
మిచెల్ మార్ష్ 6, ట్రావిస్ హెడ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరాజ్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. హర్షిత్ రాణా సిరాజ్ కలిసి ఆల్టర్నేటివ్ ఓవర్లలో బరిలోకి దిగాడు.
ఒక మార్పుతో బరిలోకి
ఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. యువ ఆటగాళ్లు రాణించడం మా జట్టుకు శుభపరిణామం. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసే సువర్ణావకాశం మా ముందుంది.
గత మ్యాచ్‌లో కూపర్ కన్నోలి అద్భుతంగా ఆడాడు. ఈ వన్డేలో మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేవియర్ బార్ట్‌లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.
టీమిండియాలో రెండు మార్పులు
మరోవైపు.. టీమిండియా గత మ్యాచ్‌లలో చేసిన పొరపాటును సరిచేసుకున్నట్లు అనిపిస్తోంది. రెండు వన్డేల్లో బెంచ్‌కే పరిమితం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఎట్టకేలకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణలను ఎంపిక చేసుకుంది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లు
టీమిండియా
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.


