సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే పదడుగులు ముందుకు వేస్తుంది.. ఈ డైలాగ్ సరిగ్గా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సరిపోతుంది. దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కోహ్లి.. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే డకౌటై తీవ్ర నిరాశపరిచాడు.
అ తర్వాత రెండో మ్యాచ్‌లో కూడా మళ్లీ డకౌట్. దీంతో కోహ్లిపై సర్వాత్ర విమర్శల కురిసింది. కోహ్లి రిటైర్ అయపోతాడని, ఇక లండన్‌కు బ్యాగ్ సర్ధుకోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ కోహ్లి అభిమానులు మాత్రం తమ ఆరాధ్య క్రికెటర్‌గా బలంగా తిరిగొస్తాడని నమ్మారు.
వారి నమ్మకాన్ని కోహ్లి నిలబెట్టాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ విశ్వరూపం చూపించాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 81 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌తో సచిన్, సంగక్కరల వరల్డ్ రికార్డులను కింగ్ బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2027కు తను సిద్దమనేని ఈ నాక్‌తో కోహ్లి చాటి చెప్పాడు. ఇక తన ఇన్నింగ్స్‌పై మ్యాచ్ అనంతరం కోహ్లి స్పందించాడు.
"అదృష్టవశాత్తూ డకౌట్ల నుంచి బయటపడగలిగాను. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా కాలం ఆడినా.. ప్రతీ మ్యాచ్ కూడా మనకు కఠిన సవాల్‌ను విసరుతోంది. కొన్నిసార్లు పూర్తిగా పరుగులు ఎలా సాధించాలో తెలియకపోయినట్లు అన్పిస్తోంది. ఈ జేంటల్‌మేన్ గేమ్ మనల్ని పరీక్షిస్తోంది.
నా కెరీర్‌లో ఇటువంటి పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి. ఈ కఠిన పరిస్థితులలే నాలోని ప్రతిభను వెలికితీశాయి. రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. రోహిత్ శర్మ క్రీజులో ఉంటే స్ట్రైక్స్ రొటేట్ చేయడం సులభమవుతుంది. అతడితో భాగస్వామ్యాన్ని అస్వాదించాను.
ఛేజింగ్ ఎల్లప్పుడూ నాలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెస్తుంది. ఇద్దరం ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన జోడీగా మేము ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మ్యాచ్‌లలో భారీ భాగస్వామ్యాలను నెలకొల్పాము.
2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే హోమ్ సిరీస్ నుంచి మా ఇద్దరి పార్టనర్ షిప్ మొదలైంది. ఆ మ్యాచ్‌లో దాదాపు 20 ఓవర్ల పాటు కలిసి బ్యాటింగ్ చేశాము. ఆస్ట్రేలియాలో మాకు లభించిన ఆదరణకు మేము రుణపడి ఉంటాము" అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి-రోహిత్ ఇద్దరూ 168 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్


