
భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే సందర్భంగా జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం వాటిల్లగా... చివరకు 26 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది.
అయితే మ్యాచ్‌కు పదేపదే వర్షం ఆటంకం కల్పించినప్పుడు ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సేదతీరుతూ కనిపించారు. ఆ సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తన స్నేహితుడైన రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి పాప్‌కార్న్ తింటున్న రోహిత్‌ను చూస్తూ... ‘అరే భాయ్ ఉసే పాప్‌కార్న్ మత్ దే’ (సోదరా అతడికి పాప్‌కార్న్ ఇవ్వకు) అంటూ కామెంట్ చేశాడు.
టెస్టు, టి20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ... ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తున్న హిట్‌మ్యాన్... ఇటీవల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వచ్చిన విరామంలో... ఏకంగా 11 కేజీల బరువు తగ్గాడు.
దీనిపై మ్యాచ్‌కు ముందు అభిషేక్ మాట్లాడుతూ... ‘రోహిత్ పూర్తిగా మారిపోయాడు. మరింత ఫిట్‌గా, మరింత దృఢంగా మారాడు. ఫిట్‌నెస్ పెంపొందించుకుంటే... నైపుణ్యం దానంతటదే పెరుగుతుంది. ఈ విషయంలో రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇదంతా 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకునే కావచ్చు. అప్పటి వరకు ఆటలో కొనసాగాలంటే మొదట తన బరువు తగ్గించుకోవాలని రోహిత్ బలంగా అనుకున్నాడు. దాని వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇప్పుడతడు నవ యువకుడిలా కనిపిస్తున్నాడు’ అని అన్నాడు.
చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే?