టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దోళ్లే కాదు చిన్న పిల్లలూ అతడి ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు. ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు ఓ ‘బుల్లి’ అభిమాని కోహ్లిని కలిశాడు.
ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా?.. ఆ చోటా ఫ్యాన్ కోహ్లి బాల్యంలో ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉండటం ఇక్కడ విశేషం. ఈ విషయాన్ని కోహ్లి (Virat Kohli)నే స్వయంగా అంగీకరించాడు. అంతేకాదు రోహిత్ శర్మ (Rohit Sharma)తోనూ ఇదే విషయం చెప్పాడు. స్వదేశంలో కివీస్‌తో వన్డే సిరీస్‌తో టీమిండియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా వడోదరలో ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లిని ఓ పిల్లాడు కలిశాడు. ఈ క్రమంలో కోహ్లి తనను చూసి ఎలా స్పందించాడో తాజాగా చెప్పుకొచ్చాడు. ‘‘కోహ్లి అని పిలిచి.. హాయ్ చెప్పాను.
నా డూప్లికేట్ అక్కడ కూర్చున్నాడు
ఒక్క నిమిషంలో వస్తాను అని కోహ్లి నాతో అన్నాడు. అంతలోనే రోహిత్ శర్మవైపు తిరిగి.. ‘నా డూప్లికేట్ (Young Virat Kohli Doppelganger) అక్కడ కూర్చున్నాడు చూడు’ అని చెప్పాడు. అక్కడున్న వాళ్లంతా నన్ను చోటా చీకూ అని పిలిచారు’’ అంటూ ఆ బుడ్డోడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
93 పరుగులు
కాగా కోహ్లి ముద్దుపేరు చీకూ అన్న విషయం తెలిసిందే. తనలాగే ఉన్న ఆ పిల్లాడిని కలిసి.. అతడికి ఫొటోగ్రాఫ్ కూడా ఇచ్చి ఖుషీ చేశాడు కోహ్లి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో భారత్ న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
కివీస్ విధించిన 301 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. కోహ్లి సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా 45వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరోవైపు.. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో 26 పరుగులు చేయగలిగాడు. ఇక భారత్- కివీస్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్‌కోట్ వేదిక.
చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు!
Virat Kohli said to Rohit Sharma, "Wha dekh Mera duplicate betha hai (Look, my duplicate is sitting there)".
- Virat Kohli called him a Chota Cheeku 😭❤️ pic.twitter.com/b4r1DopMUa— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 12, 2026


