నెదర్లాండ్స్ జట్టు (PC: Cricket Netherlands)
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు నెదర్లాండ్స్ తమ జట్టును ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్‌వర్డ్స్ ప్రపంచకప్ టోర్నీలో తమ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.
విక్రమ్‌జిత్‌పై వేటు..
ఇక ఈ జట్టు నుంచి భారత సంతతికి చెందిన విక్రమ్‌జిత్ సింగ్ (Vikramjit Singh)ను తప్పించారు. ఇటీవల బంగ్లాదేశ్- స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో విఫలమైన అతడిపై యాజమాన్యం వేటు వేసింది.
తేజ కూడా లేడు
విజయవాడకు చెందిన తేజ నిడమనూరు సైతం ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఆర్యన్ దత్‌కు మాత్రం సెలక్టర్లు చోటిచ్చారు. మాక్స్ ఒడౌడ్ జట్టులో స్థానం నిలుపుకోగా.. బాస్ డి లీడేకు కూడా చోటు దక్కింది.
పాక్‌తో మ్యాచ్‌తో మొదలు
కాగా ఈసారి ఇరవై జట్లు ప్రపంచకప్ టోర్నీలో భాగం కాగా.. నెదర్లాండ్స్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్ దశలో ఫిబ్రవరి 7న పాకిస్తాన్‌తో కొలంబోలో.. ఫిబ్రవరి 10న ఢిల్లీలో నమీబియాతో.. ఫిబ్రవరి 13న యూఎస్‌ఏతో చెన్నై వేదికగా.. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో టీమిండియాతో నెదర్లాండ్స్ జట్టు తలపడనుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి నెదర్లాండ్స్ జట్టు
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), నోహ్ క్రోస్ (వికెట్ కీపర్), మాక్స్ ఒ డౌడ్, సాకిబ్ జుల్ఫికర్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, పాల్ వాన్ మీకెరెన్, ఫ్రెడ్ క్లాసెన్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, మైకేల్ లెవిట్, జాక్ లయన్ కాచెట్, లోగన్ వాన్ బీక్, రొలొఫ్ వాన్ డెన్ మెర్వె, టిమ్ వాన్ డెర్ గుటెన్.
చదవండి: చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు


