-
చెలరేగిన మ్యాక్స్ ఓడౌడ్, విన్నింగ్ రన్ కొట్టిన ఆంధ్ర క్రికెటర్.. నెదర్లాండ్స్‌కు మరో విజయం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నెదర్లాండ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. రెండ్రోజుల కిందట (జూన్ 22) యూఎస్ఏపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జూన్ 24) నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరపించింది. ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (75 బంతుల్లో 90; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి నెదర్లాండ్స్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతనికి విక్రమ్‌జిత్ సింగ్ (30), బాస్ డి లీడ్ (41 నాటౌట్) సహకరించగా.. ఆంధ్ర క్రికెటర్ (విజయవాడలో పుట్టాడు) తేజ నిడమనూరు (2 నాటౌట్) నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. విజృంభించిన వాన్ బీక్.. కుప్పకూలిన నేపాల్ ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. వాన్ బీక్ (9.3-1-24-4), బాస్ డి లీడ్ (2/31), విక్రమ్‌జిత్ సింగ్ (2/20), క్లేటన్ ఫ్లాయిడ్ (1/31), ఆర్యన్ దత్ (8-2-23-1) ధాటికి 44.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెలరేగిన మ్యాక్స్ ఓడౌడ్.. 168 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (90) చెలరేగి ఆడాడు. ఓడౌడ్ దాదాపుగా ప్రతి నేపాల్ బౌలర్‌ను టార్గెట్ చేసి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఆఖర్లో బాస్ డి లీడ్ (39 బంతుల్లో 41 నాటౌట్; 6 ఫోర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా నెదర్లాండ్స్ కేవలం 27.1 ఓవర్లలో వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ బౌలర్లలో సందీప్ లామిచ్చెన్ 2, గుల్సన్ ఝా ఓ వికెట్ పడగొట్టారు. -
ఆసీస్‌కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు ఎవరంటే!
ICC Mens T20 World Cup 2022- Super 12: టీ20 ప్రపంచకప్-2022 విజేత ఎవరో మరికొన్ని రోజుల్లో తేలనుంది. టీమిండియా- జింబాబ్వేతో సూపర్-12 దశకు ఆదివారం(నవంబరు 6) తెరపడిన విషయం తెలిసిందే. వర్షం అంతరాయం జట్ల తలరాతను ప్రభావితం చేసే అంశంగా పరిణమించగా.. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్.. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్తాన్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఇక డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు స్వదేశంలో ప్రతిష్టాత్మక టోర్నీలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. సూపర్-12లో తమ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్- శ్రీలంకను ఓడించి ఆసీస్‌కు నిరాశను మిగిల్చింది. పత్తా లేని వార్నర్ ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మరో పరాభవాన్ని కూడా ముటగట్టుకుంది. సూపర్-12 ముగిసే సరికి అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా కంగారూ ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హం. గత ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన డేవిడ్ వార్నర్ ఈ ఎడిషన్‌లో(44) అసలు పత్తానే లేకుండా పోయాడు. వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడం, చిన్న జట్లు క్వాలిఫైయర్స్‌లో ఆడిన విషయాన్ని పక్కన పెడితే.. ఆసీస్ బౌలర్లు సైతం సొంతగడ్డపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కోహ్లి తర్వాతి స్థానంలో అతడే టాప్-10 రన్ స్కోరర్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మొదటి స్థానంలో నిలవగా.. పసికూన నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్ ఒడౌడ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత మిడిలార్డర్ స్టార్, టీ20 ర్యాంకింగ్స్ నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానం దక్కించుకున్నాడు. కోహ్లి వర్సెస్ సూర్య కోహ్లి, సూర్య తప్ప మిగిలిన వాళ్లంతా క్వాలిఫైయర్స్ ఆడిన జట్లకు చెందిన వారు కావడం విశేషం. అయితే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ గనుక రేసులో నిలవకపోతే.. వీరిద్దరిలో ఎవరో ఒకరు టోర్నీ టాపర్‌గా అవతరించే అవకాశం ఉంది. మన అర్ష్ కూడా ఇక బౌలర్ల విషయానికొస్తే.. వనిందు హసరంగ అగ్ర స్థానంలో ఉండగా.. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు తొమ్మిదో స్థానం దక్కింది. ఈ లిస్ట్‌లో కూడా అర్ష్, సామ్ కర్రన్, షాదాబ్ ఖాన్ తప్ప మిగిలిన వాళ్లు క్వాలిఫైయర్స్ ఆడారు. కాగా నవంబరు 13న ఫైనల్‌తో ప్రపంచకప్-2022 టోర్నీకి ముగియనుంది. టీ20 ప్రపంచకప్ 2022: సూపర్-12 అత్యధిక పరుగుల వీరులు 1. విరాట్ కోహ్లి(ఇండియా)-246 2. మాక్స్ ఒడౌడ్(నెదర్లాండ్స్)-242 3. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 225 4. కుశాల్ మెండిస్ (శ్రీలంక)- 223 5. సికందర్ రజా(జింబాబ్వే)- 219 6. పాతుమ్ నిసాంక (శ్రీలంక)- 214 7. లోర్కాన్ టకర్ (ఐర్లాండ్)- 204 8. గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)- 195 9. షాంటో (బంగ్లాదేశ్)- 180 10. ధనుంజయ డి సిల్వ(శ్రీలంక)- 177 అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు 1. వనిందు హసరంగ (శ్రీలంక)- 15 2. బాస్ డి లీడ్ (నెదర్లాండ్స్)- 13 3. బ్లెస్సింగ్ ముజరబానీ (జింబాబ్వే)- 12 4. అన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా)- 11 5. జాషువా లిటిల్ (ఐర్లాండ్)- 11 6. వాన్ మెకరిన్ (నెదర్లాండ్స్)- 11 7. సామ్ కర్రన్ (ఇంగ్లండ్)- 10 8. షాదాబ్ ఖాన్(పాకిస్తాన్)- 10 9. అర్ష్‌దీప్ సింగ్ (ఇండియా)- 10 10. సికందర్ రజా (జింబాబ్వే)- 10 చదవండి: WC 2022: ఒక్క క్యాచ్‌తో తారుమారు: సౌతాఫ్రికాలో పుట్టి ఆ జట్టునే దెబ్బకొట్టిన ప్లేయర్లు.. టీమ్‌లో తెలుగు కుర్రాడు కూడా! T20 WC 2022: సెమీ ఫైనల్ జట్లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర వివరాలు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్‌కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement