హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు పద్మశ్రీ అవార్డు | PADMA SHRI FOR ROHIT SHARMA AND HARMANPREET KAUR | Sakshi
Sakshi News home page

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు పద్మశ్రీ అవార్డు

Jan 25 2026 6:37 PM | Updated on Jan 25 2026 6:47 PM

PADMA SHRI FOR ROHIT SHARMA AND HARMANPREET KAUR

2026 పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ఇవాళ (జనవరి 25) ప్రకటించింది. మొత్తం 131 మంది ఈ అవార్డులకు ఎంపిక కాగా.. ఇందులో 113 మందికి పద్మశ్రీ, 13 మంది పద్మభూషణ్‌, ఐదుగురికి పద్మవిభూషణ్‌ అవార్డులు లభించాయి. 

ఇందులో క్రీడారంగానికి సంబంధించి ఎనిమిది మందికి పద్మ అవార్డులు లభించగా.. వీరిలో టెన్నిస్‌ దిగ్గజం విజయ్‌ అమృత్‌రాజ్‌కు పద్మవిభూషణ్‌, 

భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, భారత సీనియర్‌ మహిళల క్రికెట్‌ జట్టు ప్రస్తుత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టు మాజీ పేసర్‌ ప్రవీణ్‌ కుమార్‌, భారత సీనియర్‌ మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్‌ సవిత పూనియా సహా మరో ముగ్గురికి (బల్దేవ్‌ సింగ్‌, భగవాన్‌దాస్‌ రైక్వార్‌, కే పజనివేల్‌) పద్మశ్రీ అవార్డులు లభించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement